Principal Advisor to PM, PK Sinha : ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పిఎంఓ) నుండి మరో ఉన్నతస్థాయి అధికారి నిష్క్రమించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీఎం సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. సిన్హా క్యాబినెట్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన తరువాత, పిఎంఓలో ‘ప్రిన్సిపల్ అడ్వైజర్’ అనే కొత్త పోస్టును ఆయన కోసం సృష్టించి ఆయన సేవల్ని పొందుతున్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ కేడర్ 1977 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి ప్రదీప్ కుమార్ సిన్హా. ఆయన భారత 31 వ క్యాబినెట్ కార్యదర్శిగా సేవలందించారు.
ఈ నియామకానికి ముందు సిన్హా భారతదేశ విద్యుత్ కార్యదర్శిగా పనిచేశారు. దీనికి ముందు భారత షిప్పింగ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. కాగా, ఆగస్టు 30, 2019 న సిన్హాను ప్రధాని కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా నియమించారు. 11 సెప్టెంబర్ 2019 న ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు.
Read also : Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి