రేపు ముఖ్యమంత్రులతో మళ్ళీ మోదీ వీడియో కాన్ఫరెన్స్ ?

ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17 తో అంతమయ్యే లాక్ డౌన్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రధాన ఎజెండాగా ఉండవచ్ఛు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల మార్కింగ్ రూల్స్ పై పలు రాష్ట్రాలు కేంద్రానికి తమ అభ్యంతరాలను తెలిపినట్టు సమాచారం. లక్షలాది వలస కార్మికులు తమ తమ సొంత ప్రదేశాలకు తరలి వెళ్తున్న దృష్ట్యా.. కరోనా కేసుల సంఖ్య పెరగవచ్చునని […]

  • Umakanth Rao
  • Publish Date - 3:23 pm, Sun, 10 May 20
రేపు ముఖ్యమంత్రులతో మళ్ళీ మోదీ వీడియో కాన్ఫరెన్స్ ?

ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17 తో అంతమయ్యే లాక్ డౌన్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రధాన ఎజెండాగా ఉండవచ్ఛు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల మార్కింగ్ రూల్స్ పై పలు రాష్ట్రాలు కేంద్రానికి తమ అభ్యంతరాలను తెలిపినట్టు సమాచారం. లక్షలాది వలస కార్మికులు తమ తమ సొంత ప్రదేశాలకు తరలి వెళ్తున్న దృష్ట్యా.. కరోనా కేసుల సంఖ్య పెరగవచ్చునని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయట.  ఇదే పరిస్థితి కొనసాగితే.. సాధారణ జన జీవన పునరుధ్ధరణ కష్ట సాద్యమని ఇవి అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కలర్ కోడ్ నిబంధనల ప్రకారం.. క్వారంటైన్ సెంటర్లను రెడ్ జోన్లుగా నోటిఫై చేయాలని కొంతమంది ముఖ్యమంత్రులు అభ్యర్థించారు. అటు-దేశంలో అనేక జిల్లాలు ఇంకా రెడ్ జోన్లలో ఉన్న విషయం గమనార్హం. ఇలా ఉండగా.. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ తౌబా ఆదివారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.