Heeraben Modi Passed Away Updates: తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ.. తల్లి చితికి నిప్పంటించిన కుమారులు..

|

Updated on: Dec 30, 2022 | 1:47 PM

PM Modi Mother Funeral: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబా 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ తుదిశ్వాస విడిచారు.

Heeraben Modi Passed Away Updates: తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ.. తల్లి చితికి నిప్పంటించిన కుమారులు..
Pm Modi Carries Mortal Remains Of Mother

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ(100)  కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జూన్‌ 18న వందేళ్లు పూర్తి చేసుకున్నారు. వందేళ్ల వయస్సు ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కొద్దిరోజుల క్రితం నుంచి మాత్రం ఆరోగ్యం క్షీణించింది. అహ్మదాబాద్‌ UN మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు ముగిశాయి..అంతకుముందు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ తల్లి పాడె మోశారు. కడసారి హీరాబెన్‌ను చూసి నివాళులర్పించారు స్థానికులు, బీజేపీ నేతలు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు ఆమె పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

ప్రధాని మోదీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ ప్రధాని మోదీ పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. డిసెంబర్‌లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను చివరిసారిగా కలిశారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చొని టీ తాగారు.

లైవ్ కోసం ఇక్కడ చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Dec 2022 12:33 PM (IST)

    సంతాపం తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్ సర్​ సంఘ్​ ఛాలక్

    ప్రధాని మోదీ తల్లి హీర్బెన్ మోదీ మృతికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్​ సంఘ్​ ఛాలక్​ మోహన్​ భగవత్ సంతాపం తెలిపారు. హీరాబెన్ మోడీ తన విలువలకు కట్టుబడి ఉన్నారని.. ఆమె జీవితంలో అపారమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సర్వశక్తిమంతుడిపై ఆమెకు అచంచలమైన విశ్వాసం ఉందని భగవత్ గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో ప్రధాని మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా వెల్లడించారు.

  • 30 Dec 2022 12:24 PM (IST)

    ‘వందేమాత్రం’ జపం చేసిన నేల నుంచి ‘వందే భారత్’

    ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమోట్ బటన్‌ను నొక్కి కోల్‌కతాలో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ నేను మీ అందరి మధ్యకు రావాల్సి వచ్చిందని.. వ్యక్తిగత కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయాను, ఇందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఇవాళ పవిత్రమైన బెంగాల్‌కు నమస్కరించే అవకాశం నాకు లభించిందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్ర భారత చరిత్ర ఈ రాష్ట్రంతో ఇమిడి ఉంది.’వందేమాత్రం’ జపం చేసిన నేల నుంచి ‘వందే భారత్’ జెండా ఊపడం ఆనందంగా ఉంది.”

    Pm Modi Flags Off Vande Bharat Express From Howrah Railway Station

    PM Modi Flags Off Vande Bharat Express From Howrah Railway Station

  • 30 Dec 2022 12:16 PM (IST)

    కోల్‌కతా కార్యక్రమంలో మమతా బెనర్జీ సంతాపం..

    కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి, ఈ రోజు మీకు చాలా బాధాకరమైన రోజు, ఈ బాధను భరించే శక్తిని ఇవ్వమని భగవంతుడిని ప్రార్థిస్తాను. ఈ కార్యక్రమాన్ని తగ్గించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ." మీరు ఇప్పుడే మీ తల్లి అంత్యక్రియల నుంచి వచ్చారు కాబట్టి దీనిని పక్కన పెట్టండి అంటూ సీఎం మమతా కోరారు.

  • 30 Dec 2022 11:45 AM (IST)

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

    హౌరా నుండి జల్‌పైగురి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వాస్తవంగా జెండా ఊపి ప్రారంభించారు.

  • 30 Dec 2022 11:44 AM (IST)

    శ్మశాన వాటిక నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు..

    శ్మశాన వాటిక నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్తున్నారు ప్రధాని మోదీ. అక్కడ నుంచి అధికారిక కార్యక్రమాలలో పొల్గొటారు. ముందుగా వర్చువల్‌గా పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు.

  • 30 Dec 2022 11:42 AM (IST)

    సంతాపం తెలుపుతూ నివాళులర్పించిన..

    ప్రధాని మోదీ తల్లి మృతిపై దేశ వ్యాప్తంగా స్పందన వస్తోంది. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతూ నివాళులర్పిస్తున్నారు. 

  • 30 Dec 2022 11:40 AM (IST)

    సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ

    ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన ట్వీట్ చేస్తూ, “ప్రధాని నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరాబెన్ మృతి వార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, ప్రేమను తెలియజేస్తున్నాను.

  • 30 Dec 2022 11:15 AM (IST)

    అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ..

    తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.  సెక్టార్ 30కి సమీపంలోనే రాజ్ భవన్ ఉంది. తల్లి దహన సంస్కారాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్నానం చేసి, రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలకు హాజరవుతారు.

  • 30 Dec 2022 10:47 AM (IST)

    సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి

    ప్రధాని మోదీకి మాతృవియోగం కలగడంతో పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.” మన గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ప్రియమైన తల్లి శ్రీమతి హీరాబెన్ మోడీ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. స్వర్గలోకానికి బయలుదేరిన ఆమె దివ్య ఆత్మకు నా నివాళులు. మోదీ గారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను ” అంటూ ట్వీట్ చేశారు చిరు.

  • 30 Dec 2022 09:56 AM (IST)

    సంతాపం తెలిపిన గవర్నర్ తమిళిసై

    ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మరణంపై విచారం వ్యక్తం చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. మాతృమూర్తిగా హీరాబెన్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవితను కూడా గవర్నర్‌ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు." శైశవం నుండే దృఢమైననాయకునిగా పెంచి ప్రజా జీవితంలో మేరు పర్వతం వంటి ఉన్నతమైన వ్యక్తిని బలమైన నాయకుణ్ణి ప్రపంచానికి అందించిన అద్వితీయమైన తల్లి శ్రీమతి హీరాబెన్ ఇక లేరు. వయసు పైబడినా పుట్టినప్పటి నుంచి.. ప్రేమ వెలుగులు పరిచిన మాతృ దీపం ఆరిపోయింది. మన ప్రధాని ప్రేమ వెల్లువ కనుమరుగైందన్న వార్త వింటే మా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేనినైనా తట్టుకునే శక్తిని మన ప్రధాని నరేంద్ర మోడీ జి కి ఎల్లప్పుడూ ఇచ్చే భగవంతుడు ఇప్పుడు కూడా ఈ మాతృ వియోగాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి ఆశీర్వదించా లని ప్రార్ధిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.

  • 30 Dec 2022 09:46 AM (IST)

    అంత్యక్రియలకు హాజరైన గుజరాత్ సీఎం

    ప్రధాని తల్లి అంత్యక్రియలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత సీఎం భూపేంద్ర పటేల్  శ్మశానవాటిక నుంచి తిరిగి వెళ్తున్నారు. 

  • 30 Dec 2022 09:45 AM (IST)

    అంత్యక్రియల చితికి ముందుగా పెద్ద కుమారుడు సోంభాయ్..

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా పెద్ద కుమారుడు సోంభాయ్ అంత్యక్రియల చితికి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, ఇతర సోదరులు కూడా ఉన్నారు.

  • 30 Dec 2022 09:32 AM (IST)

    హీరాబెన్ మోదీ అంత్యక్రియలు ముగిశాయి..

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిశాయి. ఎంతో సింపుల్‌గా అంతిమయాత్రను నిర్వహించారు. తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆమెకు నివాళులు అర్పించారు. తల్లి పాడె మోసి.. ఆమె పార్థివదేహంతోనే ప్రధాని నరేంద్ర మోదీ అంతిమయాత్ర వాహనంలో వెళ్లారు.

  • 30 Dec 2022 09:14 AM (IST)

    మీ పనిని ఆపవద్దు.. ప్రధాని మోదీ కుటుంబ సభ్యుల సందేశం..

    తల్లి హీరాబెన్ మరణవార్త తెలియగానే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతలు గుజరాత్‌కు చేరుకుని చివరి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ పనిని ఆపవద్దని.. పనిని కొనసాగించాలని ప్రధాని మోదీ కుటుంబం తరపున చెప్పబడింది.

  • 30 Dec 2022 09:08 AM (IST)

    Prime minister Mother passed away LIVE : ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మృతిపై సీఎం కేసీఆర్ నివాళి

    ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • 30 Dec 2022 09:00 AM (IST)

    మరికాసేపట్లో అంత్యక్రియలు

    మరికాసేపట్లో గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించనున్నారు.

    మరికాసేపట్లో హీరాబెన్‌ అంత్యక్రియలు

  • 30 Dec 2022 08:58 AM (IST)

    ప్రధాని మోదీ తల్లి మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం...

    ప్రధాని మోదీ తల్లి మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేస్తూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి హీరాబా వంద సంవత్సరాల పోరాట జీవితం భారతీయ ఆదర్శాలకు ప్రతీక.. శ్రీ మోదీ తన జీవితంలో 'మాతృదేవోభవ' స్ఫూర్తిని, హీరా బెన్ విలువలను నింపారు. పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి! అంటూ ట్వీట్ చేశారు.

  • 30 Dec 2022 08:49 AM (IST)

    గులాం నబీ ఆజాద్ సంతాపం..

    ప్రధాని నరేంద్ర మోడీ తల్లి మృతి పట్ల నివాళులు అర్పించారు డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాం నబీ ఆజాద్. గులాబ్ నబీ ఆజాద్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు.

  • 30 Dec 2022 08:42 AM (IST)

    హీరాబెన్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. హీరాబెన్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • 30 Dec 2022 08:34 AM (IST)

    ప్రోటోకాల్‌ పక్కన పెట్టి అంతిమయాత్ర వాహనంలో..

    తల్లి పార్థివ దేహానికి సమీపంలో ప్రధాని మోదీ కూడా అంతిమయాత్ర వాహనంలో కూర్చున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టారు. కొడుకుగా తల్లి అంత్యక్రియలకు చేరుకున్నాడు.

  • 30 Dec 2022 08:32 AM (IST)

    తల్లి పాడెను భుజంపై మోస్తూ..

    ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను ఆమె చివరి యాత్రకు తీసుకెళ్తున్నారు. తల్లి పాడెను భుజంపై మోస్తు కనిపించారు.

  • 30 Dec 2022 08:29 AM (IST)

    మొదలైన ప్రధాని మోదీ తల్లి అంతిమ యాత్ర

    ప్రధాని మోదీ తల్లి అంతిమ యాత్ర మొదలైంది.

  • 30 Dec 2022 08:20 AM (IST)

    సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • 30 Dec 2022 08:17 AM (IST)

    మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం..- ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

    ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు "అమ్మ". ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం అమ్మ. విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం. అంటూ ట్వీట్ చేశారు ట్విట్టర్ లో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

  • 30 Dec 2022 08:13 AM (IST)

    ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం జగన్‌

    ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ మోదీ మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • 30 Dec 2022 08:11 AM (IST)

    లోకేష్ సంతాపం..

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • 30 Dec 2022 08:08 AM (IST)

    అహ్మదాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

    మాతృమూర్తి హీరాబెన్ మరణంతో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు చేరుకున్నారు. మరోవైపు ఈ రోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు.

  • 30 Dec 2022 08:07 AM (IST)

    మంచి బుద్ధితో పనిచేస్తూ స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని..

    వందో పుట్టినరోజు నాడు తల్లి దీవెనలు తీసుకున్నారు మోదీ. మంచి బుద్ధితో పనిచేస్తూ స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని మోదీకి తల్లి హీరాబెన్ చెప్పారు. ప్రధాని మోదీతో తల్లి హీరాబెన్‌ చివరిమాటలు అవే కావడంతో మోదీ కన్నీటి పర్యంతమయ్యారు.

  • 30 Dec 2022 07:58 AM (IST)

    ప్రముఖుల సంతాపం..

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్​ మోదీ మృతి పట్ల పలువురు సంతాపం తెెలిపారు. గుజరాత్​ సీఎం భూపేంద్ర పాటిల్​తో పాటు రక్షణశాఖ మంత్రి రాజనాథ్​ సింగ్​ సంతాపం తెలుపుతూ ట్వీట్​ చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​, మధ్యప్రదేశ్​ సీఎం శివ్​ రాజ్​ సింగ్​ చౌహాన్​, కేంద్ర మంత్రి అమిత్​ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • 30 Dec 2022 07:47 AM (IST)

    ఒక సన్యాసి ప్రయాణంలో..

    తన తల్లి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ ఇలా వ్రాశారు, "నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు.

  • 30 Dec 2022 07:34 AM (IST)

    తెల్లవారుజామున 3:30 గంటలకు..

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో 100 సంవత్సరాల వయస్సులో మరణించారు. మరికాసేపట్లో, ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ వెళ్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా హీరాబెన్ బుధవారం ఉదయం 'యుఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్'లో చేరారు. ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ ఈ రోజు (డిసెంబర్ 30) తెల్లవారుజామున 3:30 గంటలకు తుది శ్వాస విడిచారు. 

  • 30 Dec 2022 07:26 AM (IST)

    తల్లికి అంకితం చేస్తూ..

    100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్​ చేశారు మోదీ. దాదాపు అరగంట పాటు మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్​ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.

  • 30 Dec 2022 07:24 AM (IST)

    1923 జూన్‌ 18న జన్మించిన హీరాబెన్​ మోదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ.. ఈ ఏడాది జూన్​లో వందో వడిలోకి అడుగుపెట్టారు. 1923 జూన్‌ 18న ఆమె జన్మించారు. హీరాబెన్ పుట్టినరోజున.. ప్రధాని మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్‌ మోదీ నివాసానికి వెళ్లి తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

  • 30 Dec 2022 07:16 AM (IST)

    తల్లి హీరాబెన్‌ను చివరిసారిగా..

    ప్రధాని మోదీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ ప్రధాని మోదీ పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. డిసెంబర్‌లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను కలిశారు, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను చివరిసారిగా కలిశారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చొని టీ తాగారు.

  • 30 Dec 2022 07:09 AM (IST)

    ఆ రోజు ఏం జరిగిందంటే..

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబా మంగళవారం అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇది కాకుండా, ఆమె దగ్గుతో బాధపడ్డారు. దీని తరువాత, ఆమెను వెంటనే అహ్మదాబాద్‌లోని UN మెహతా హాస్పిటల్‌లోని కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్‌లో చేర్చారు. వైద్యులు ఆమె తల్లికి MRI, CT స్కాన్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. అయితే, శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

  • 30 Dec 2022 06:50 AM (IST)

    స్వయంగా ప్రధాని ట్వీట్ ద్వారా..

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Published On - Dec 30,2022 6:51 AM

Follow us