PM Narendra Modi: అయోధ్యలో ఆతిథ్యమిచ్చిన మహిళకు ప్రధాని మోడీ లేఖ.. బహమతులు కూడా.. ఏమేం పంపించారో తెలుసా?

|

Jan 03, 2024 | 10:15 PM

కేంద్ర ప్రభుత్వం 2016లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారుల్లో 10 కోట్లవ లబ్ధిదారు మీరా కావడంతో ఆమె నివాసాన్ని ప్రధాని స్వయంగా సందర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా తమ ఇంటికి రావడం, టీ తాగడంతో మీరా, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.

PM Narendra Modi: అయోధ్యలో ఆతిథ్యమిచ్చిన మహిళకు ప్రధాని మోడీ లేఖ.. బహమతులు కూడా.. ఏమేం పంపించారో తెలుసా?
PM Narendra Modi
Follow us on

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అయోధ్యలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే మోడీ అయోధ్య పర్యటనలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. లతా మంగేష్కర్ చౌక్ సమీపంలో ఇరుకు వీధుల గుండా ప్రయాణిస్తూ మీరా మాఝీ అనే మహిళ ఇంటికి వెళ్లారు ప్రధాని. ఆమె భర్త సూరజ్‌, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మీరా స్వయంగా తమ ఇంట్లో తయారు చేసిన తేనీటిని ప్రధాని సేవించారు. కేంద్ర ప్రభుత్వం 2016లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారుల్లో 10 కోట్లవ లబ్ధిదారు మీరా కావడంతో ఆమె నివాసాన్ని ప్రధాని స్వయంగా సందర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా తమ ఇంటికి రావడం, టీ తాగడంతో మీరా, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. అయితే అయోధ్యలో తనకు మర్చిపోలేని ఆతిథ్యమిచ్చిన మీరా మాఝీకి తాజాగా లేఖ రాశారు ప్రధాని మోడీ. అంతేకాదు మీరా కుటుంబ సభ్యులకు బహమతులు కూడా పంపారు. ఇందులో ఒక టీ సెట్, రంగురంగుల డ్రాయింగ్ బుక్‌తో పాటు మరిన్ని గిఫ్ట్స్‌ కూడా ఉన్నాయి.

ఒక సామాన్య వక్తిగా ప్రధాని మోడీ తమ ఇంటికొచ్చినప్పుడే సంతోషంలో మునిగి తేలిపోయారు మీరా కుటుంబ సభ్యులు. ఇది జరిగి సుమారు నాలుగు రోజులవుతోంది కూడా. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకుని మరీ ప్రధాని మోడీ లేఖ రాయడంతో మీరా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

ఇవి కూడా చదవండి

టీ సెట్ తో పాటు..

మీరా కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..