PM Modi Germany, UAE Tour: ప్రధాని మోడీ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. జర్మనీలో రెండు రోజులు, యూఏఈలో ఒక రోజు పాటు ఈ పర్యటన కొనసాగనున్నదని తెలిపింది. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జూన్ 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు
ఈ G7 వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం సహా అనేక సమస్యల గురించి చర్చించనున్నారు. మోడీ ఈ సమావేశంలో పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్యం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో దక్షిణ జర్మనీలోని ఆల్పైన్ క్యాజిల్ ఆఫ్ ష్లోస్ ఎల్మౌను సందర్శిస్తారు. అనంతరం ప్రధాని మోడీ జూన్ 28న జర్మనీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లనున్నారు. UAE మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినందుకు ప్రధాని మోడీ సంతాపాన్ని తెలియజేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..