World Environment Day: రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం.. పర్యావరణంపై చర్చ..

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు రైతులతో సమావేశం కానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ

World Environment Day: రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం.. పర్యావరణంపై చర్చ..
Pm Narendra Modi

Updated on: Jun 05, 2021 | 8:21 AM

PM Narendra Modi Address: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు రైతులతో సమావేశం కానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరుగుతుందని.. దీనిలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని పీఎంఓ వెల్లడించింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో ప్రధాని ముచ్చటించనున్నారు. దీంతోపాటు పర్యావరణ సమస్యలు, పరిష్కార మార్గాలపై కూడా ప్రధాని పలు కీలక సూచనలు చేయనున్నారు.

ఈ సమావేంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథనాల్‌ బ్లెండింగ్‌ రోడ్‌ మ్యాప్‌పై నిపుణుల కమిటీ నివేదిక విడుదల చేయనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. భారత ప్రభుత్వం ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ను విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ ఈ-20 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా పూణేలో పైలట్‌ ప్రాజెక్టును సైతం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు కూడా వర్చువల్ ద్వారా పాల్గొననున్నారు.

Also Read:

Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు

Etela rajender: నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్..