Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతినెలా జరిగే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 84వ ఎపిసోడ్ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. దీనిలో ప్రధాని మోదీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తోపాటు ఎన్నో విషయాలపై ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం.. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, న్యూసోనైర్ మొబైల్ యాప్‌లో ప్రసారం కానుంది. కాగా.. దేశంలో కరోనావైరస్ మహమ్మారి కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలు, పండుగలు ఉన్న నేపథ్యంలో శనివారం ప్రధాని మోదీ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. అయితే పెరుగుతున్న ఒమిక్రాన్ కరోనా కేసుల మధ్య.. మరోసారి ప్రధాని మోదీ పలు కీలక విషయాలపై ప్రసంగించే అవకాశం ఉంది. దీంతోపాటు పలు సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్ చేసి వెల్లడించింది.
కాగా.. అక్టోబర్ 3, 2014న ప్రసారమైన మన్ కీ బాత్ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ప్రసారం అవుతుంది. 2021 చివరి ఎపిసోడ్ నవంబర్ 28న ప్రసారం అయింది. దీనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాలపై సంభాషిస్తారు.
PM @narendramodi to share his thoughts in ‘Mann Ki Baat’ programme, Sunday morning at 11 am on @DDNational & Live-Stream on https://t.co/OFUmYgGtxS pic.twitter.com/K36pVYAm0W
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) December 25, 2021
Also Read: