Central Government Formation live news updates in Telugu: ప్రపంచమంతా ఇప్పుడు డిల్లీ వైపు చూస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు మోదీ. రాత్రి 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక నమో పట్టాభిషేకానికి దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులు తరలి వస్తున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవ్స్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఢిల్లీకి వచ్చే వీరందరికీ తగిన ఆతిథ్యం ఇవ్వడంతోపాటు రాకపోకల సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫిఫ్ ఇదివరకే ఢిల్లీకి చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా సంబరాలు… రాష్ట్రపతి భవన్‌లో అద్వితీయ ఏర్పాట్లు.. నమో ప్రమాణోత్సవం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్ ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. చీమ చిటుక్కుమన్న గుర్తించేలా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో ఢిల్లీని జల్లెడ పడుతున్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజులు ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు, విశిష్ట అతిథులు బస చేసిన హోటల్ దగ్గర సెక్యూరిటిని పటిష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కేంద్రంలో ముచ్చటగా మూడో సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడో సారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 71మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానితో సహా మంత్రుల చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్త కేబినెట్‌తో రాష్ట్రపతి గ్రూప్ దిగారు.
పబిత్రా మార్గెరిటా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో తొలిసారిగా రాజ్యసభ ఎంపీ. అస్సాంలో బీజేపీకి ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు. అస్సాం నుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు.
రాష్ట్ర మంత్రిగా జార్జ్ కురియన్ ప్రమాణ స్వీకారం చేశారు. 4 దశాబ్దాలుగా కేరళలో బీజేపీ కోసం పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా. జాతీయ మైనారిటీ కమిషన్ జాతీయ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
రాష్ట్ర మంత్రిగా మురళీధర్ మోహోల్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ఎంపీ ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా, మేయర్‌గా కూడా పనిచేశారు. ఈసారి పూణె లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఢిల్లీ ఎంపీ హర్ష్ మల్హోత్రా రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో పాటు గుజరాత్‌లోని భావ్‌నగర్ ఎంపీ నెముబెన్ బంభానియా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ…కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన ఆయనకు మోదీ కేబినెట్‌లో బెర్త్ లభించింది. చివరి నిమిషంలో భూపతిరాజు బెర్త్ ఖరారయింది.
#WATCH | BJP leader Bhupathiraju Srinivasa Varma takes oath as a Union Cabinet Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/NJKfNLSSkY
— ANI (@ANI) June 9, 2024
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ బీజేపీ ఎంపీ తోఖం సాహుకు మంత్రి పదవి దక్కింది. దీంతో పాటు బీహార్‌కు చెందిన రాజభూషణ్ చౌదరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర మంత్రిగా సుకాంత మజుందార్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సావిత్రి ఠాకూర్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ ఎంపీ దుర్గాదాస్ ఉకే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రక్షా ఖడ్సే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జాట్ నాయకుడు భాగీరథ్ చౌదరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అజ్మీర్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సతీష్ చంద్ర దుబే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రిగా సంజయ్ సేథ్ ప్రమాణ స్వీకారం చేశారు.
రవనీత్ సింగ్ బిట్టు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రవ్‌నీత్ సింగ్ బిట్టు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు రవనీత్ సింగ్.
మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ ఎల్ మురుగన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ రాజకీయాలపై గట్టి పట్టున్న అజయ్ కుమార్ తమ్తా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బన్స్‌గావ్ ఎంపీ కమలేష్ పాశ్వాన్,రాజస్థాన్ అజ్మీర్ ఎంపీ భగీరథ్ చౌదరి, బీహార్ రాజ్యసభ ఎంపీ సతీష్ దూబే, జార్ఖండ్ రాంచీ ఎంపీ సంజయ్ సేథ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేరళలో బీజేపీ ఖాతా తెరిచిన సురేష్ గోపి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలోని 20 స్థానాల్లో త్రిసూర్‌లో తొలిసారిగా బీజేపీని విజయపథంలో నడిపించారు. మలయాళ చిత్రాలలో ప్రసిద్ధ నటుడు సురేష్ గోపీ మోదీ మంత్రి మండలిలో స్థానం సంపాదించుకున్నారు.
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. బండి సంజయ్ వరుసగా రెండోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. చిన్నప్పట్నుంచే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నారు. ఏబీవీపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. యువ మోర్చాతోపాటు పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టారు. కేరళ, తమిళనాడు బీజేపీ ఇన్‌ఛార్జీగా పనిచేశారు. ప్రస్తుతం కిసాన్ మోర్చా జాతీయ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
#WATCH | BJP leader Bandi Sanjay Kumar takes oath as a Union Cabinet Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/SPM9j7kgLV
— ANI (@ANI) June 9, 2024
పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్ నుంచి ఎంపీ శాంతను ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర మంత్రిగా బీఎల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2018లో యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా పని
బెంగళూరు నార్త్ స్థానం నుంచి గెలుపొందిన శోభా కరంద్లాజే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
యూపీలోని ఆగ్రా సీటు నుంచి ఎంపీగా గెలుపొందిన ఎస్పీ సింగ్ బాఘేల్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటకకు చెందిన వి సోమన్న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి తుమకూరు స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కూడా అయ్యారు.
కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణం చేశారు. గుంటూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన చంద్రశేఖర్ తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ఐశ్వర్యవంతుడైన ఎంపీగా పెమ్మసాని ఉన్నారు. మోదీ కేబినెట్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పెమ్మసాని నిలిచారు.
#WATCH | TDP leader Dr Pemmasani Chandra Sekhar takes oath as a Union Cabinet Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/jdJeTbRlUZ
— ANI (@ANI) June 9, 2024
బీహార్‌లోని ఉజియార్‌పూర్ ఎంపీ నిత్యానంద్ రాయ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిత్యానందకుప్రభుత్వంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.
అప్నా దళ్ (సోనేవాల్) చీఫ్, మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. పటేల్ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.OBC కమ్యూనిటీ నుండి వచ్చారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని బలోపేతం చేశారని కొనియాడారు.
Congratulations to @narendramodi on winning a third term as Prime Minister. You have strengthened India's position as a source of innovation for global progress in sectors like health, agriculture, women-led development, and digital transformation. Look forward to a continued…
— Bill Gates (@BillGates) June 9, 2024
జేడీయూ ఎంపీ రామ్‌నాథ్ ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర మంత్రిగా RPI చీఫ్ రాందాస్ అథవాలే ప్రమాణ స్వీకారం చేశారు.
హర్యానాలోని ఫరీదాబాద్ ఎంపీగా ఉన్న కృష్ణ పాల్ గుర్జార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఎంపీ పంకజ్ చౌదరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో వరుసగా మూడోసారి పంకజ్ చౌదరి విజయం సాధించారు. ఓబీసీ ఓటర్లపై ఆయనకు గట్టి పట్టు ఉంది.
శ్రీపాద్ నాయక్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర గోవా స్థానం నుండి ఎంపీగా గెలుపొందారు. శ్రీపాద్ నాయక్ 1994 నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 2009 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అటల్ బిహారీ వాజ్‌పాజ్ ప్రభుత్వంలోనూ మంత్రిగా కూడా పనిచేశారు.
జితిన్ ప్రసాద్ స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పిలిభిత్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా గెలుపొందారు. జితిన్ ప్రసాద్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ మంత్రిగా కూడా ఉన్నారు.
ఆర్ఎల్డీ అధినేత, జాట్ నేత జయంత్ చౌదరి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయంత్ చౌదరి స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయంత్ చౌదరి 2009లో తొలిసారిగా మధుర నుంచి ఎంపీ అయ్యారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ రైతు నాయకుడిగా జయంత్‌కు బలమైన ఇమేజ్ ఉంది.
రాజస్థాన్‌లోని బికనీర్ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ మరోసారిగి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జితేంద్ర సింగ్ వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
హర్యానాలోని గుర్గావ్ ఎంపీ, రావు ఇంద్రజిత్ సింగ్ మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో ప్రణాళిక శాఖ సహాయ మంత్రిగా కొనసాగారు.
గుజరాత్‌లోని నవ్‌సారి ఎంపీ, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు అయిన సీఆర్ పాటిల్ తొలిసారిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాటిల్ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా, నాలుగోసారి ఎంపీ అయ్యారు.
బీహార్‌లోని హాజీపూర్ ఎంపీ, ఎల్‌జేపీ (ఆర్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తొలిసారిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిరాగ్ LJP దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు.
#WATCH | LJP (Ram Vilas) chief Chirag Paswan sworn-in as Union Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/WbnraEpSKj
— ANI (@ANI) June 9, 2024
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు జి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఎంపీ అయ్యారు. గత ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతుల కుమారుడు కిషన్ రెడ్డి. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన కిషన్ రెడ్డి 1995లో వివాహం చేసుకున్నారు. జయప్రకాశ్ నారాయణ స్పూర్తితో జనతా పార్టీ యువకార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1980 నుంచి 1981 వరకు బీజేవైఎం రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. 1982 నుంచి 1983 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఐదేళ్లుగా పని చేశారు.
2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి కిషన్ రెడ్డి విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2019లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో మొదటిసారి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ 2024లో సికింద్రాబాద్ లోక్‌ససభ స్థానం నుంచి పోటీ అత్యధిక మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది.
#WATCH | BJP leader Gangapuram Kishan Reddy sworn-in as Union Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/VAUjK1fJIS
— ANI (@ANI) June 9, 2024
మోదీ 3.0 కేబినెట్‌లో మరోసారి కేంద్ర మంత్రులుగా కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవియా స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మరోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
గత ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. జార్ఖండ్‌లోని కోడెర్మా స్థానం నుంచి అన్నపూర్ణాదేవి ఎంపీగా ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించారు. OBC కేటగిరీలో ఆమెకు మంచి పట్టు ఉంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి ఎంపీగా గెలిచిన గజేంద్ర సింగ్ షెఖావత్ గత ప్రభుత్వంలో జలశక్తి మంత్రిగా ఉన్నారు. కేబినెట్ మంత్రిగా మరోసారి ప్రమాణం చేశారు.
ప్రముఖ బీజేపీ వ్యూహకర్త, తొలిసారి ఎంపీగా ఎన్నికైన భూపేంద్ర యాదవ్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గత ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒడిశా నుంచి రాజ్యసభ ఎంపీ అశ్విని వైష్ణవ్ మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని గుణ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
బీహార్‌లోని బెగుసరాయ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు.
జువల్ ఒరాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు ఒరాన్. ఒడిశాలోని సుందర్‌ఘర్‌కు చెందిన ఎంపీ, బీజేపీ గిరిజన నేత జుయల్ ఓరాన్.
గత ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ జోషి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక నుంచి వరుసగా ఐదోసారి ఎన్నికల్లో విజయం సాధించారు ప్రహ్లాద్ జోషి.
కేంద్ర కేబినెట్ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేపట్టారు. మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి రామ్మోహన్ నాయుడు.
#WATCH | TDP Kinjarapu Ram Mohan Naidu takes oath as a Union Cabinet Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/8UjzEjuUKj
— ANI (@ANI) June 9, 2024
మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వీరేంద్ర ఖటిక్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరేంద్ర ఖటిక్ గత ప్రభుత్వంలో సామాజిక న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
బీజేపీ నేత సర్బానంద సోనోవాల్ వరుసగా మూడోసారి మంత్రి అయ్యారు.
జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా జితన్ రామ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా అధినేత, ఎంపీ జితన్ రామ్ మాంఝీ తొలిసారిగా కేంద్ర మంత్రిమండలిలో స్థానం సంపాదించుకున్నారు. అంతకు మందు ఆయన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర మంత్రిగా వరుసగా మూడోవసారి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో బీజేపీ ముఖ్య ఎన్నికల వ్యూహకర్తగా, విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు నిర్వహించారు.
#WATCH | BJP leader Dharmendra Pradesh sworn in as Union Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/mn4qGONaVY
— ANI (@ANI) June 9, 2024
కేంద్ర మంత్రిగా వరుసగా మూడోవసారి ప్రమాణ స్వీకారం చేశారు పీయూష్ వేదప్రకాష్ గోయల్.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడు. వొక్కలిగ సంఘం నుండి వచ్చారు. కర్ణాటకలోని మాండ్యా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహార్‌లాల్ ఖట్టర్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖట్టర్ మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్. హర్యానాకు 9 ఏళ్లు సీఎంగా ఉన్నారు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
మోదీ ప్రభుత్వం 2.0లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం జైశంకర్ కొత్త ప్రభుత్వంలోనూ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్ర మంత్రిగా వరుసగా మూడోవసారి ప్రమాణ స్వీకారం చేశారు తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర కేబినెట్‌లో చోటు సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి కేబినెట్ హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు
బీజేపీ ఎంపీ నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడ్కరీ గత ప్రధాని మోదీ రెండు ప్రభుత్వాల్లోనూ కేబినెట్ మంత్రిగా ఉన్నారు.
కేంద్ర మంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేశారు. నేను అమిత్ చంద్ర షా అంటూ ఈశ్వరుడిపై ప్రమాణ స్వీకారం చేాశారు. బీజేపీ నేత అమిత్ షా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గుజరాత్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. గాంధీనగర్ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
#WATCH | BJP leader Amit Shah takes oath as a Union Cabinet minister in the PM Narendra Modi-led NDA government pic.twitter.com/UnNXKeJdCY
— ANI (@ANI) June 9, 2024
ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేను నరేంద్ర దామోదర్ దాస్ మోదీని. అంటూ మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం. దీంతో ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ప్రారంభం అయ్యింది.
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో 71 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 72వ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రమాణం చేయనున్నారు. మోదీ 3.0 కేబినెట్‌లో 30 మంది క్యాబినెట్ మంత్రులు, 5 మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యతలు) మరియు 36 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణం చేయనున్నారు.
జాతీయ గీతంతో మూడోవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభం.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్టుకు చేరుకున్నారు.
Delhi | Prime Minister-designate Narendra Modi arrives at the Forecourt of the Rashtrapati Bhavan, to take oath for the third consecutive term. pic.twitter.com/Ed22ukeMrL
— ANI (@ANI) June 9, 2024
రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సతీసమేతంగా హాజరయ్యారు.
#WATCH | CJI DY Chandrachud along with his wife arrive at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony pic.twitter.com/xxkkHpZtuc
— ANI (@ANI) June 9, 2024
మూడోవసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న మోదీ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే సీని నటులు సూపర్ స్టార్ రజనీకాంత్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
#WATCH | Actor Rajinikanth at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony. pic.twitter.com/27Zp5edH1m
— ANI (@ANI) June 9, 2024
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. అతిథులతో కలిసి రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆసీనులయ్యారు.
#WATCH | Congress chief Mallikarjun Kharge at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony pic.twitter.com/gfhrSB1Z5M
— ANI (@ANI) June 9, 2024
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కూడా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మురళీ మనోహర్ జోషిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.
#WATCH | Andhra Pradesh CM designate N Chandrababu Naidu meets veteran BJP leader Murli Manohar Joshi at Rashtrapati Bhavan pic.twitter.com/YA67ZO5IPs
— ANI (@ANI) June 9, 2024
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖేష్ అంబానీ, నటుడు షారుక్ ఖాన్, ప్రసూన్ జోషి, కంగనా రనౌత్ సహా పలువురు అతిథులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
#WATCH | BJP MP-elect Amit Shah & BJP MP-elect Nitin Gadkari at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony pic.twitter.com/phGoEyMBFy
— ANI (@ANI) June 9, 2024
కాసేపట్లో మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి చాలామంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ ప్రధానులు, అధ్యక్షులు హాజరుకానున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. అలాగే ఎన్‌ఎస్‌జి కమాండోలు, డ్రోన్‌లు, స్నిపర్‌లు కూడా మెగా ఈవెంట్‌కి సెక్యూరిటీగా ఉన్నాయి.
నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ముందే ఎన్డీయే అసమ్మతి తెరపైకి రావడం మొదలైంది. శివసేన లాగా మనకు కూడా కేబినెట్ మంత్రి పదవిని రావల్సి ఉందని ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్ అన్నారు. మాకు స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని అజిత్ పవార్ కోరుతున్నారు. అంతకుముందు, ప్రఫుల్ పటేల్ కూడా తనకు రాష్ట్ర మంత్రి పదవిని ఆఫర్ చేశారని, అయితే తాను కేబినెట్ మంత్రిగా ఉన్నానని, అందుకే తిరస్కరించానని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌కు దేశవిదేశీ అతిథులు చేరుకుంటున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అతిథులు రావడం మొదలైంది.
#WATCH | Delhi | Preparations in the final stage as PM-designate Narendra Modi is set to take oath for the third straight term at 7.15 pm at the Forecourt of Rashtrapati Bhavan today pic.twitter.com/BRRivDx5Vw
— ANI (@ANI) June 9, 2024
మోదీ 3.0 కేబినెట్‌లో ఎన్‌సీపీకి చోటు దక్కకపోవడంపై ప్రఫుల్ పటేల్ తొలిసారిగా స్పందించారు. గత రాత్రి తమ పార్టీకి స్వతంత్ర బాధ్యతతో కూడిన రాష్ట్ర మంత్రి పదవిని ఇస్తామని చెప్పారని ఆయన అన్నారు. తాజా జాబితా ప్రకారం మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న తనకు పదోన్నతి కలిగేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానానికి తెలియజేశామని, కొద్దిరోజులు వేచిచూడాల్సిందిగా కోరామని చెప్పారు.
కేంద్ర కేబినెట్ కూర్పు తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్ర కేబినెట్‌లో ఉంటే జాతీయ అధ్యక్షుడిగా మరొకరికి ఛాన్స్ ఇచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ BJP అధ్యక్షుడిగా అనురాగ్ ఠాగూర్ ఉంటారని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్‌లో బీజేపీ ఓటమి చవిచూసింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటింది బీజేపీ. — హిమాచల్‌లో నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 9 మంది కేంద్రమంత్రులు
మిత్రపక్షాలతో కలిపి బీహార్ నుంచి 8 మంది మంత్రులు
ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు
మహారాష్ట్ర నుంచి ఆరుగురు, గుజరాత్ నుంచి ఐదుగురికి ఛాన్స్
కర్నాటక నుంచి ఐదుగురికి, ఒడిశా నుంచి ముగ్గురికి ..
మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి నలుగురు చొప్పున మంత్రులు
జార్ఖండ్ , బెంగాల్ నుంచి ఇద్దరేసి మంత్రులు
కేరళ, తమిళనాడు, గోవా, హిమాచల్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ జమ్ముకశ్మీర్, అరుణాచల్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి కేబినెట్‌లో నో ఛాన్స్. అయితే సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చింది. అయితే కేబినెట్ మంత్రి పదవి కావాలని అజిత్ పవార్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనుండడంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కార్యకర్తలు బాణాసంచా పేల్చి పండుగ చేసుకున్నారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు సంజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బండి సంజయ్ ఇంట్లోనూ సందడి వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకున్నారు. సామాన్య కార్యకర్తకు కేంద్రమంత్రి పదవి రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.
మోదీ 3.0 కేబినెట్‌లో స్థానం లభించకపోవడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తొలిసారిగా స్పందించారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యకర్తని, ఐదోసారి ఎంపీ కావడం తనకు దక్కిన గౌరవం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాబోయే మంత్రులకు అభినందనలు తెలుపుతూ దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, కొత్త శిఖరాలకు చేరుకుంటుందని అనురాగ్ ఠాకూర్ అకాంక్షించారు.
వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో వ్యక్తి మోదీ అవుతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో అవినీతిని అరికట్టేందుకు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు, పేదలకు సేవ చేసేందుకు నరేంద్ర మోదీ గత 10 ఏళ్ల ఎంత కృషీ చేశారన్నారు. రాబోయే 5 ఏళ్లలో మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామన్నారు.
మరికాసేపట్లో నరేంద్ర మోదీ మూడోవసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పండిట్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ పీఎంగా రికార్డు సృష్టించిన మోదీ.. తన టీమ్‌తో మరోసారి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్. ఒక్కడిగా కాదు, అందరితో కలిసి… అలయన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ కేబినెట్ కూర్పు జరగడం కీలకంగా చెప్పొచ్చు.
అందులోనూ ఈ దఫా తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యత. ఎన్డీఏ సర్కార్‌ని సరికొత్తగా ఎలివేట్ చేస్తోంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ 3.0 మంత్రివర్గంలో భాగం కానున్నారు. ఆయన ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో మోదీ తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతకు ముందు 2014లో కూడా జేపీ నడ్డా మోదీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
52 మందితో కూడిన కేంద్ర మంత్రుల జాబితా విడుదలైంది. .
*అమిత్ షా – బీజేపీ
*రాజ్నాథ్ సింగ్ – బీజేపీ
*నితిన్ గడ్కరీ – బీజేపీ
*జ్యోతిరాదిత్య సింధియా – బీజేపీ
*శివరాజ్ సింగ్ చౌహాన్ – బీజేపీ
*పీయూష్ గోయల్ – బీజేపీ
*రక్షా ఖడ్సే – బీజేపీ
*జితేంద్ర సింగ్ – బీజేపీ
*రావ్ ఇంద్రజీత్ సింగ్ – బీజేపీ
*మనోహర్ లాల్ ఖట్టర్ – బీజేపీ
*మన్సుఖ్ మాండవియా – బీజేపీ
*అశ్విని వైష్ణవ్ – బీజేపీ
*శంతను ఠాకూర్ – బీజేపీ
*జి కిషన్ రెడ్డి – బీజేపీ
*హర్దీప్ సింగ్ పూరి – బీజేపీ
*బండి సంజయ్ – బీజేపీ
*శోభా కరందాజే – బీజేపీ
*రవ్నీత్ సింగ్ బిట్టు – బీజేపీ
*బిఎల్ వర్మ – బీజేపీ
*కిరణ్ రిజిజు – బీజేపీ
*అర్జున్ రామ్ మేఘవాల్ – బీజేపీ
*రవ్నీత్ సింగ్ బిట్టు – బీజేపీ
*సర్బానంద సోనోవాల్ – బీజేపీ
*శోభా కరంద్లజే – బీజేపీ
*శ్రీపాద్ నాయక్ – బీజేపీ
*ప్రహ్లాద్ జోషి – బీజేపీ
*నిర్మలా సీతారామన్ – బీజేపీ
నిత్యానంద రాయ్ – బీజేపీ
*కృష్ణపాల్ గుర్జర్ – బీజేపీ
*సిఆర్ పాటిల్ – బీజేపీ
*పంకజ్ చౌదరి – బీజేపీ
*సురేష్ గోపి – బీజేపీ
*సావిత్రి ఠాకూర్ బీజేపీ – బీజేపీ
*గిరిరాజ్ సింగ్ – బీజేపీ
*గజేంద్ర సింగ్ షెకావత్ – బీజేపీ
*మురళీధర్ మొహల్ – బీజేపీ
*అజయ్ తమ్గా – బీజేపీ
*ధర్మేంద్ర ప్రధాన్ – బీజేపీ
*హర్ష్ మల్హోత్రా – బీజేపీ
*బిఎల్ వర్మ – బీజేపీ
*ప్రతాప్ రావ్ జాదవ్ – శివసేన (షిండే వర్గం)
*రామ్నాథ్ ఠాకూర్ – JDU
*లాలన్ సింగ్ – JDU
*మోహన్ నాయుడు – TDP
*పి చంద్రశేఖర్ పెమ్మసాని – TDP
*చిరాగ్ పాశ్వాన్ – LJP(R)
*జితన్ రామ్ మాంఝి – హెచ్.ఎ.ఎం.
*జయంత్ చౌదరి – RLD
*అనుప్రియా పటేల్ – అప్నా దళ్(లు)
*చంద్ర ప్రకాష్ (జార్ఖండ్) – ఆజ్సు
*హెబ్డి కుమారస్వామి – JD(S)
*రాందాస్ అథవాలే – RPI
మంత్రులుగా ప్రమాణం చేయబోయే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు మోదీ. 100 రోజుల అభివృద్ధి ప్రణాళికను వివరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంపై కేంద్ర మంత్రులు ఫోకస్ చేయాలని సూచించారు. కేటాయించిన శాఖల లక్ష్యాలపై దృష్టిపెట్టాలన్నారు. రోడ్ మ్యాప్ ప్రకారం వెళ్తే.. 2047 కల్లా వికసత్ భారత్ సాధన లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు మోదీ.
మోదీతో పాటు ఆయన క్యాబినెట్ సహచరులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బీజేపీ నుంచి అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, పియూష్ గోయెల్, సురేష్ గోపి, మేఘ్‌వాల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, హర్‌దీప్‌పూరి, సింధియా, కిరణ్ రిజుజు, అశ్వినీ వైష్ణవ్, మాండవీయలకు చోటు దక్కనుంది.
మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హస్తం పార్టీ స్వయంగా వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే హాజరుకానున్నారు. కూటమిలోని కీలక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మోదీ కొత్త కేబినెట్‌లో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన ఖాయమని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి హిమాచల్ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరో కేబినెట్ మంత్రి పురుషోత్తమ్ రూపాలపై వేటు ఖాయమని తెలుస్తోంది. రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ , హర్యానాలో బీజేపీకి చాలా డ్యామేజ్ జరిగింది. అందుకే ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాలని మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణేకు కూడా ఈసారి కేబినెట్‌లో చోటు దక్కదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌ని కూడా మంత్రి పదవి వరించింది. కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన బండి.. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు మోదీ 3.0లో భాగం కాబోతున్నారు. మొదటిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టనున్నారు బండి సంజయ్. వీరిద్దరికి పీఎంవో నుంచి పిలుపు రావడంతో కలిసి ఒకే కారులో దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు.
ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలంగాణకూ ప్రత్యేక ప్రాధాన్యత దక్కింది. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ లీడర్ కిషన్‌రెడ్డికి మరోసారి కేబినెట్‌లో చోటు దక్కింది. మోదీ 2.0లో సహాయ మంత్రిగా పనిచేయడమే కాకుండా… కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. మోదీ 3.0లో సైతం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబోతున్నారు.
మోదీ ప్రమాణస్వీకారం, తెలంగాణకు కేబినెట్ బెర్త్‌లు ఓకే అయిన సందర్భంగా తెలంగాణలో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితో పాటు మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవులు దక్కడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాలోని బీజేపీ ఆఫీస్ దగ్గర బాణసంచా కాల్చి తీన్మార్ స్టెప్పులేశారు.
ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కి ఈసారి కేబినెట్ బెర్త్ కన్‌ఫాం అయింది. అంతా రాత్రి 7.15 నిమిషాల తరువాత ప్రమాణస్వీకారం చేస్తారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఏపీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది.
మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా ఢిల్లీకి ఏడుగురు దేశాధినేతలు వస్తున్నారు. వారిలో నేపాల్, మారిషస్, సీచల్, భూటాన్ తో పాటు ఇతర దేశాధినేతలు ఉన్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవం కోసం భారీ భద్రతతో పాటు నాలుగు అంచెల నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రమాణస్వీకార వేదిక ప్రాంగణం దగ్గర 5 కేంద్ర బలగాలు మోహరించాయి. ఎన్ఎస్జీ కమాండోలు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా పెట్టాయి.
మరో 3గంటల్లో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భారీ భద్రత నడుమ కేంద్ర మంత్రులుగా 47మంది ప్రమాణస్వీకారం చేస్తారు. సాయంత్రం 7.15 నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు అవుతుంది.