PM Narendra Modi Speech Updates: దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సెకండ్‌వేవ్ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కంటే తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు అందజేయనున్నట్లు చెప్పారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికి ఉచితంగా టీకాలు అందజేస్తామని మోదీ స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సినేషన్, అదేవిధంగా థర్డ్ వేవ్ ముప్పును అధిగమించే అంశంపై కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు ఆప్పత్రులు టీకాకు రూ.150 కంటే ఎక్కువ తీసుకోవద్దు. కోవిడ్ టీకా కోసం ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ.150 కంటే ఎక్కువ తీసుకోవద్దు. లేకపోతే చర్యలు తీసుకుంటాము- ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయి. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించడమే మనకు రక్ష. వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు అని మోదీ అన్నారు. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ.. 75శాతం రాష్ట్రాలుకు అందించనుండగా, 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు టీకా కోసం ప్రజలనుంచి రూ.150 మాత్రమే తీసుకోవాలని అన్నరు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్ అందుకుంటారని అన్నారు.
కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయి. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించడమే మనకు రక్ష. వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. – ప్రధాని మోదీ
దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ.. 75శాతం రాష్ట్రాలుకు అందించనుండగా, 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు టీకా కోసం ప్రజలనుంచి రూ.150 మాత్రమే తీసుకోవాలి.- ప్రధాని మోదీ
ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేది. వాళ్ల అవసరాలు తీరాకే మనకు వ్యాక్సిన్ ఇచ్చే వాళ్లు. – ప్రధాని మోదీ
దేశంలో కరోనా వ్యాక్సిని అరికట్టేందుకు దేశంలో నవంబర్ నెల నాటికి 85 శాతం టీకా పంపిణీ పూర్తవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సిన్ల పంపిణీలో 25శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తున్నాము.- మోదీ
దేశంలోని రాష్ట్రాలు ఇక నుంచి వ్యాక్సిన్ల కోసం ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టవద్దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరా చేస్తుంది. ప్రతి ఒక్కరికి టీకా అందేలా కేంద్రమే చర్యలు తీసుకుంటుంది.
కోవిడ్ టీకా కోసం ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు రూ.150 కంటే ఎక్కువ తీసుకోవద్దు. లేకపోతే చర్యలు తీసుకుంటాము- ప్రధాని మోదీ
75 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రం సరఫరా చేస్తుంది. 25 శాతం వ్యాక్సిన్ డోసులు ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుంది.
జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం. అభివృద్ధి చెందిన అనేక దేశాల కంటే ఇండియాలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది.
జూన్ 21 నుంచి18 ఏళ్ల పైబడిన వారందరి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందజేస్తుంది. దేశంలోని రాష్ట్రాలు ఒక్కపైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
దేశంలో ఇప్పుడు ఏడు కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ముక్కులో వేసే వ్యాక్సిన్‌పై ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దేశ ప్రజలందరికి ఉచితంగా టీకా అందిస్తున్నాము – ప్రధాని మోదీ
స్వదేశీ సంస్థల టీకా ఉత్పత్తితో ప్రపంచానికి మన శక్తి ఏంటో చూపించాము. గత ఏడాది ఏప్రిల్‌లోనే మనం వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాము.
మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్ తయారు చేశారు. వ్యాక్సిన్ తయారీలో అన్ని విధాలుగా కేంద్రం మద్దతు ఇచ్చింది. కేంద్రం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయి – ప్రధాని మోదీ
భారత్‌కు ప్రపంచ దేశాలు తగినంత సాయం చేస్తున్నాయి. పిల్లలకు వందశాతం టీకా ఇచ్చేందుకు కరోనా అడ్డంకిగా మారింది. కరోనా దేశ ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఎంతో మంది ఆప్తులను కోల్పోయారు – ప్రధాని మోదీ
కరోనా కట్టడికి దేశంలో చర్యలు మరింత వేగవంతం చేశామని, దేశ విదేశాల నుంచి టీకాలు తెప్పిస్తున్నాము. విదేశాల నుంచి మందులు కూడా తెప్పిస్తున్నాము.. అని అన్నారు.
అతి తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తిని పది రెట్లకు మించి పెంచాము. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చాము. అవసరమైన మందుల ఉత్పత్తిని పెంచాము. కోవిడ్ ప్రోటోకాల్‌ను ప్రతీ ఒక్కరు పాటించాలి అని మోదీ అన్నారు.
కరోనా అత్యంతదారుణమైన మహమ్మారి. కరోనా వల్ల దేశ ప్రజలు ఎంతో బాధ అనుభవించారు. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదు. కరోనాను పూర్తిగా అంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాము అని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని, మన దేశంలో యుద్దప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని అన్నారు
ప్రధాన నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
దేశంలో సెకండ్‌వేవ్ కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అందరు మోదీ ప్రసంగం పై ఎదురు చూస్తున్నారు.
జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని నరేంద్రమోదీ.. కరోనా పరిస్థితుల్లో అమలవుతున్న లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రకటన చేసే అవకాశం ఉంది.
కాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో మోదీ ప్రసంగంపై మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.