PM Modi: వికసిత్‌ భారత్‌ ఆకాంక్షలకు ప్రతిబింబం.. బడ్జెట్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

PM Modi on Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ -2024ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా ఉంది. 2027 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా భారత ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

PM Modi: వికసిత్‌ భారత్‌ ఆకాంక్షలకు ప్రతిబింబం.. బడ్జెట్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi

Updated on: Feb 01, 2024 | 1:52 PM

PM Modi on Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ -2024ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా ఉంది. 2027 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా భారత ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జె్‌ట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. వికసిత్‌ భారత్‌కు ఈ బడ్జెట్‌ అంకితమంటూ మోదీ పేర్కొన్నారు. ఉపాధికి ఎన్నో అవకాశాలు బడ్జెట్‌ కల్పిస్తోందని.. దేశ యువత ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌ ప్రతిభింబమంటూ మోదీ పేర్కొన్నారు. 2047 కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని.. ఈ గ్యారంటీని బడ్జెట్‌ ఇచ్చిందని మోదీ అభిప్రాయపడ్డారు.

వీడియో చూడండి..

బడ్జెట్‌ స్వరూపం ఇదే..

  • 2024-25 బడ్జెట్‌ అంచనా రూ.47.66 లక్షల కోట్లు
  • 2024-25లో రుణాలు మినహా రాబడి రూ.30.80 లక్షల కోట్లు
  • 2024-25లో రెవెన్యూ రాబడి 26.02 లక్షల కోట్లు
  • 2024-25లో ప్రణాళిక వ్యయం రూ.11.11 లక్షల కోట్లు
  • 2024-25లో అప్పులు రూ.11.75 లక్షల కోట్లు
  • 2024-25లో మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ రూ.14.13 లక్షల కోట్లు
  • 2023-24కి సవరించిన రెవన్యూ వ్యయం రూ44.90 లక్షల కోట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బడ్జెట్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..