PM Security Breach: ప్రధాని మోడీ భద్రత వైఫల్యానికి బాధ్యులు ఎవరు..? సుప్రీంలో పిటీషన్..

|

Jan 06, 2022 | 12:09 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది..? పవర్‌ఫుల్‌ పీఎం కాన్వాయి 20నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవడం వెనుక అసలేం..

PM Security Breach: ప్రధాని మోడీ భద్రత వైఫల్యానికి బాధ్యులు ఎవరు..? సుప్రీంలో పిటీషన్..
Pm Security Breach
Follow us on

PM Security Breach Matter in Supreme Court: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది..? పవర్‌ఫుల్‌ పీఎం కాన్వాయి 20నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవడం వెనుక అసలేం జరిగింది..? అడుగడుగునా పహారా.. డేగ కళ్ల నిఘా మధ్య సాగే ప్రధాని పర్యటనలో ఇంతటి భద్రతా వైఫల్యానికి కారణం ఎవరు..? సెక్యూరిటీ రీజన్స్‌తో మోడీ పర్యటన రద్దవడం సంచలనంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అయితే.. ఇప్పుడీ ఘటన సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు న్యాయవాది మణిందర్‌ సింగ్‌. అసలేం జరిగిందో..ఇందుకు కారణమెవరో తేల్చాలని..అత్యున్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేంద్రంతో పాటు పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామన్నారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.

మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్‌ ప్రభుత్వం. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం ఛన్నీ.

Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ

Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..