PM Narendra Modi: భారత న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం నిలబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అవలంభిస్తూ చాలా సృజనాత్మకతతో న్యాయవ్యవస్థ అనేక నిర్ణయాలు తీసుకుంటుందంటూ మోదీ కొనియాడారు. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. న్యాయవవస్థ దేశ ప్రజల హక్కులను రక్షించడంలో, జాతి ప్రయోజనాలను కాపాడటంలో బాధ్యతగా తన విధులను నిర్వర్తిస్తుందంటూ మోదీ వెల్లడించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచంలో అత్యధిక కేసులను విచారించిన ఘనత మన సుప్రీం కోర్టుకే దక్కుతుందని, ఇది మనందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో హైకోర్టులు, జిల్లా కోర్టులు పెద్ద ఎత్తున ఈ-విచారణలు చేపట్టాయని తెలిపారు. శతాబ్ధాలుగా న్యాయం అనేది భారతీయ సంస్కృతి, విలువల్లో ఉందని ఆయన తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు కూడా న్యాయవవస్థకు సముచిత స్థానాన్ని కల్పించారని.. సుపరిపాలన మన నాగరికతలోనే ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డైమండ్ జూబ్లీ స్మారక పోస్టల్ స్టాంపును సైతం విడుదల చేశారు.
Also Read: