Chhatrapati Shivaji: సత్యం, న్యాయం విషయంలో ఎన్నడూ రాజీపడని ధీరుడు ఛత్రపతి శివాజీ: మోడీ

Chhatrapati Shivaji:  ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. న్యాయం..

Chhatrapati Shivaji: సత్యం, న్యాయం విషయంలో ఎన్నడూ రాజీపడని ధీరుడు ఛత్రపతి శివాజీ: మోడీ

Updated on: Feb 19, 2022 | 1:44 PM

Chhatrapati Shivaji:  ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. న్యాయం విషయంలో శివాజీ ఎన్నడు కూడా రాజీపడలేదని అన్నారు. ఆయన విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. శివాజీ ఆశయాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1630లో జన్మించిన శివాజీ.. తన శౌర్యం, సైనిక మేధావి, నాయకత్వానికి గుర్తింపు పొందాడని, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్భంగా నమస్కరిస్తున్నానని మోడీ ట్వీట్‌ చేశారు. శివాజీ న్యాయం, సత్యం విలువల కోసం నిలబడే విషయంలో రాజీపడలేదన్నారు.

యావత్‌ భారత జాతి గర్వంగా చెప్పుకొనే ధీరుడు, వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ అని, పుట్టుకతోనే వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న శివాజీ గొప్ప యోధుడన్నారు. మరాఠౄ రాజ్యాన్ని స్థాపించి మొఘల్‌ చక్రవర్తులను ఎదిరించి వారి సామ్రాజ్యాన్ని తన హస్తతం చేసుకున్నారని మోడీ అన్నారు. మొఘలులను గడగడలాడించి ఆనాడే సమానత్వ సాధనకు ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారని, హిందుత్వాన్ని అనుసరిస్తూ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని అన్నారు.

శివాజీ జననం:

ఛత్రపతి శివాజీ క్రీ.శ 1630 ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం సమీపంలోని శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశం). అయితే ఛత్రపతి శివాజీకి ముందు పుట్టిన వారందరూ చనిపోతుండగా, శివాజీ కూడా ఎక్కడ మరణిస్తారోనని, ఆయన చనిపోకూడదని శివాజీకి తన ఇష్టదైవమైన శివై పార్వతి పేరు పెట్టింది.

17 ఏళ్ల వయసులోనే యుద్ధానికి..

కాగా, ఛత్రపతి శివాజీ 17 ఏళ్ల వయసులోనే తన మొదటి యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆ యుద్ధంలో బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతం అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకుచ్చి మొఘలులను గడగడలాడించాడు శివాజీ. యుద్ధంలో ఓడిపోయినా, శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్దం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సాయం చేసేవాడు శివాజీ.

 

 

ఇవి కూడా చదవండి:

Kisan Drones: రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంట పొలాల్లో పురుగుమందు పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లు

PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?