Rahul Gandhi News: అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఒడిశా రైలు ప్రమాద ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ముందుకు చూడకుండా కారు రియర్ వ్యూ అద్దాన్ని (వెనుక వైపు) చూసి డ్రైవింగ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే కారు ముందుకు వెళ్లకుండా రోడ్డు ప్రమాదాలకు గురవుతోందని ప్రధాని మోదీకి అర్థంకావడంలేదన్నారు. ప్రధాని మోదీ, మంత్రులు, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్‌కు చెందిన వారు భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదని.. గతాన్ని గురించే తవ్వుతున్నారని విమర్శించారు. వారి వైఫల్యాలకు గతంలోని వ్యక్తులను, ప్రభుత్వాలను నిందిస్తున్నారని అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైలు ప్రమాదాలు జరిగితే, దానికి బ్రిటీష్ పాలనను నిందించలేదన్నారు. ఆ ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రీ తన పదవికి రాజీనామా చేశారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అయితే నేటి పాలకులు తమ వైఫల్యాలకు గతంలోని వ్యక్తులు, ప్రభుత్వాలను నిందిస్తున్నారని అన్నారు. తమ వైఫల్యాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..