ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటనకు బయల్దేరారు. రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధాని బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. ప్రపంచాభివృద్ధి, భద్రతపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇందులో పాల్గొంటారు. బ్రిక్స్‌కు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ బ్రిక్స్ సదస్సులో పలువురు నేతలను కలుసుకుంటానని చెప్పారాయన. పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుందని మోదీ ట్వీట్‌లో తెలిపారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంతేకాకుండా విడివిడిగా కూడా పలువురు నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది.. ఈ సమ్మిట్ లో యుద్ధం సహా పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. ప్రపంచాభివృద్ధి, ఆర్థిక వృద్ధి, భద్రతపై చర్చించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.
Leaving for Kazan, Russia, to take part in the BRICS Summit. India attaches immense importance to BRICS, and I look forward to extensive discussions on a wide range of subjects. I also look forward to meeting various leaders there.https://t.co/mNUvuJz4ZK
— Narendra Modi (@narendramodi) October 22, 2024
ప్రధాని మోదీ నాలుగు నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులైలో మోదీ రష్యాలో పర్యటించారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత మాస్కోలో ప్రధాని తొలిసారి పర్యటించారు. రష్యాలోని భారత సంతతి ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటున్నారు.
2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మారింది. ఈ ఏడాది జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. దీంతో బ్రిక్స్ గ్రూపులో ఉన్న దేశాల సంఖ్య పదికి చేరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..