PM Narendra Modi: దేవభూమిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి.. ప్రజలను అభినందించిన ప్రధాని మోదీ..

|

Oct 18, 2021 | 5:33 PM

Uttarakhand Covid-19 Vaccination: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వందకోట్ల

PM Narendra Modi: దేవభూమిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి.. ప్రజలను అభినందించిన ప్రధాని మోదీ..
Pm Narendra Modi
Follow us on

Uttarakhand Covid-19 Vaccination: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వందకోట్ల మార్క్ దాటనుంది. ఈ క్రమంలో దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ తరుణంలోనే దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం.. అర్హత ఉన్న ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ అందించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజలను అభినందించారు. కోవిడ్‌పై పోరాటంలో ఉత్తరాఖండ్ సాధించిన ఈ విజయం ముఖ్యమైనదంటూ ఆయన ట్విట్ చేశారు. “దేవభూమి ప్రజలకు అభినందనలు. దేశంలో కోవిడ్‌పై పోరాటంలో ఉత్తరాఖండ్ సాధించిన ఈ విజయం చాలా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిని ఎదుర్కోవడంలో టీకా అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.. దీనిలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్‌కు.. రీట్విట్ చేశారు.

కాగా.. సోమవారం మధ్యాహ్నం 2:30 వరకు కోవిన్ డాష్‌బోర్డ్ ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌‌ను 74,34,732 మంది లబ్ధిదారులకు వేశారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 34,83,685 మందికి రెండు డోసుల టీకాను వేశారు. ఇదిలాఉంటే.. దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 97,79,47,783 డోసులను లబ్దిదారులకు అందించారు.

Also Read:

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..

Crime News: సొంతింటిపైనే కోడలి కన్ను.. కోటి విలువైన బంగారం, నగదు చోరీ.. ఎవరికి తెలియకుండా..