PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?

|

Feb 19, 2022 | 8:42 AM

PM Modi: పంజాబ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయితే ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ (PM Narendra Modi)..

PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?
Follow us on

PM Modi: పంజాబ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయితే ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ (PM Narendra Modi) సిక్కు (Sikhs) నేతలతో భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. రేపు పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆప్. మరోసారి అధికారం కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్‌. అటు ఈసారి ఎలాగైనా పంజాబ్‌లో జెండా పాతేందుకు తీవ్రంగా కృషిచేశాయి బీజేపీ, ఆప్‌. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. రాత్రితో మైకులు మూగబోయాయి. ప్రచారం ముగిసింది. రేపు పంజాబ్ (Punjab) పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలకు ముందు సిక్కు ప్రముఖులతో ప్రధాని మోదీ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని మోదీ అధికార నివాసంలో సిక్కు నేతలతో సమావేశమయ్యారు ప్రధాని. వారిని సాదరంగా స్వాగతించి ఆత్మీయంగా ముచ్చటించారు.

బీజేపీ ప్రభుత్వం సిక్కులకు తగిన గుర్తింపునిస్తోందని తెలిపారు. మోదీతో భేటీ అవడంపై సంతృప్తి వ్యక్తం చేసిన సిక్కు ప్రముఖులు. తమ సంప్రదాయమైన సిక్కుల చిహ్నంతో ముద్రించిన స్కార్ఫ్‌ను ప్రధాని తలకు చుట్టారు. శాలువా కప్పి సత్కరించారు. సిక్కుల సంప్రదాయ కత్తిని మోదీకి ప్రదానం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని, ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తని కొనియాడారు. కర్తార్‌పుర్‌ కారిడార్‌ను మళ్లీ తెరిపించడంపై ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. దీంతో సిక్కులకు ఎంతో మేలు జరిగిందన్నారు సిక్కు ప్రముఖులు. ఇక రేపు మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ పరిస్థితులలో సిక్కులతో భేటి బీజేపీకి ఎంతవరకు కలిసివస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

Maharashtra: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం.. సవాల్‌గా స్పీకర్ ఎన్నిక!

Channi Bhaiyya: కొత్త వివాదానికి తెరలేపిన చన్నీ ‘భయ్యా’ కామెంట్స్.. కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటున్నకొత్త రగడ..