PM Modi: 4-పి ఫార్మూలకు ఈ నగరం మంచి ఉదాహరణ.. సూరత్‌లో అడుగు పెట్టని రాష్ట్రం ఉండదన్న ప్రధాని మోదీ..

|

Sep 29, 2022 | 4:04 PM

రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సూరత్ చేరుకున్న ప్రధాని మోదీకి భారీ ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. సూరత్ చేరుకున్న ప్రధాని మోదీ..

PM Modi: 4-పి ఫార్మూలకు ఈ నగరం మంచి ఉదాహరణ.. సూరత్‌లో అడుగు పెట్టని రాష్ట్రం ఉండదన్న ప్రధాని మోదీ..
Pm Modi
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సూరత్ చేరుకున్న ప్రధాని మోదీకి భారీ ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. సూరత్ చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా మొత్తం రూ. 3400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ సూరత్ అభివృద్ధి నమూనాను ప్రశంసించారు. ఐకమత్యానికి, ప్రజల భాగస్వామ్యానికి సూరత్ నగరం అద్భుతమైన ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. సూరత్ గడ్డపై ఆధారపడిని రాష్ట్రాలు భారతదేశంలో ఉండవన్నారు. శ్రమను గౌరవించే నగరం సూరత్ అని అన్నారు.

ప్రధాని మోదీ నోట 4-పి మంత్రం

సూరత్‌లో జరిగిన బహిరంగ సభలో 4పీ ఫార్ములా గురించి చెప్పారు. ఈ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 3-పి ఫార్ములా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ గురించి చర్చ జరిగుతుందన్నారు. అయితే తాను మాత్రం  సూరత్‌ను 4-పికి ఉదాహరణ అని చూపిస్తానని అన్నారు. 4-పీ అంటే పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ అని కొత్త ఫార్ములను సూచించారు. ఈ ఫార్ములాకు సూరత్‌ మోడల్ అని ప్రశంసించారు.

సూరత్ ప్రజలు నేను చెప్పినట్టే చేశారు: ప్రధాని మోదీ

ఈ రోజు సూరత్ ప్రజలందరూ అలా చేసి చూపించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు సూరత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నాని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘అంటువ్యాధులు, వరద సమస్యల గురించి సూరత్ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. సూరత్ సిటీ బ్రాండింగ్‌కి వెళితే.. ప్రతి రంగం, ప్రతి కంపెనీ ఆటోమేటిక్‌గా బ్రాండింగ్ అవుతాయని నేను ఇక్కడి వ్యాపారులకు చాలా సార్లు చెప్పాను.

‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సూరత్‌లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కూడా అందించబడుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు దేశంలో సుమారు 4 కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం పొందారు. సూరత్ వస్త్ర, వజ్రాల వ్యాపారం దేశవ్యాప్తంగా అనేక కుటుంబాల జీవితాలను నిలబెట్టింది. ‘డ్రీమ్ సిటీ’ ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు, సూరత్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, అత్యంత సౌకర్యవంతమైన డైమండ్ ట్రేడింగ్ హబ్‌గా అభివృద్ధి చెందబోతోంది. అని ప్రధాని అన్నారు.

సూరత్‌కు విమానాశ్రయం కావాలి: ప్రధాని మోదీ

వ్యాపారంలో లాజిస్టిక్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో సూరత్ ప్రజలకు బాగా తెలుసన్నారు ప్రధాని మోదీ. కొత్త లాజిస్టిక్స్ పాలసీ వల్ల సూరత్ చాలా ప్రయోజనం పొందబోతోందన్నారు. మల్టీ-మోడల్ కనెక్టివిటీ కోసం సూరత్‌లో పెద్ద పథకంపై ఇప్పటికే పని ప్రారంభమైందని చెప్పారు. నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే రహదారి సూరత్ సంస్కృతి, శ్రేయస్సు, ఆధునికతను ప్రతిబింబిస్తుందని.. కానీ విమానాశ్రయం కోసం మా సుదీర్ఘ పోరాటాన్ని చూసిన చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు.

సూరత్‌కు విమానాశ్రయం ఎందుకంటూ ఢిల్లీలోని ప్రభుత్వం ఎద్దేవ చేస్తోందని ఆప్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నగరానికి ఉన్న శక్తి ఏంటో చెప్పడానికి తాము విసిగిపోయామన్నారు. ఈ రోజు చూడండి, ఇక్కడి నుంచి ఎన్ని విమానాలు నడుస్తాయో.. విమానాశ్రయంలో ప్రతిరోజూ ఎంత మంది ఇక్కడ దిగుతున్నారో చూడాలన్నారు.

 మరిన్ని జాతీయ వార్తల కోసం