PM Narendra Modi calls AP CM YS Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం చుట్టూ ‘గులాబ్’ తుఫాన్ కేంద్రీకృతమై.. పశ్చిమ దిశగా కదులుతుంది. వాయువ్య, పశ్చిమ పశ్చిమ బంగాళాఖాతంలో 140 కిమీ తూర్పు – ఆగ్నేయంలో గోపాల్‌పూర్ & కళింగపట్నానికి తూర్పున 190 కి.మీ దూరంలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బందిని సైతం మోహరించిన చర్యలు చేపట్టింది. అయితే.. తుఫాన్ ఈరోజు రాత్రికి కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీయడంతోపాటు.. నష్టం కూడా వాటిల్లుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా తుఫాన్ నష్టం.. ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ.. సీఎం జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక వెల్లడించారు.
Spoke to Andhra Pradesh CM Shri @ysjagan and took stock of the situation arising in the wake of Cyclone Gulab. Assured all possible support from the Centre. I pray for everyone’s safety and well-being.
— Narendra Modi (@narendramodi) September 26, 2021
గులాబ్ తుఫాన్ పరిస్థితి గురించి @ysjagan గారితో మాట్లాడాను .కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరు క్షేమంగా వుండాలని ప్రార్ధిస్తున్నాను .
— Narendra Modi (@narendramodi) September 26, 2021
Also Read: