PM Narendra Modi Birthday: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం.. 71 వేల దీపాలతో శుభాకాంక్షల వెల్లువ.. అర్ధరాత్రి నుంచే..

Narendra Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (సెప్టెంబర్ 17న) నేటితో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో

PM Narendra Modi Birthday: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం.. 71 వేల దీపాలతో శుభాకాంక్షల వెల్లువ.. అర్ధరాత్రి నుంచే..
Pm Narendra Modi Birthday

Updated on: Sep 17, 2021 | 1:03 AM

Narendra Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (సెప్టెంబర్ 17న) నేటితో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. బీజేపీ శ్రేణులు ఉత్సహంతో.. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా భారీ కేక్‌లను సైతం కట్ చేశారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని.. ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో అర్ధరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారత్ మాతా ఆలయం దగ్గర 71 వేల దీపాలను వెలిగించారు. దీంతోపాటు 71 కిలోల లడ్డూను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రూప గంగూలీ, బీహెచ్‌యూ మాజీ వీసీ జిసి త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కాశీ సంకల్ప్’ అనే పుస్తకాన్ని సైతం ఆవిష్కరించారు.

Also Read:

KTR: సొంత పార్టీ ఎంపీ, కీలక నేతపై రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్.. ఆడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే..

TV9 – KAB Education Summit: విద్యా, ఉద్యోగాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. ఏపీలో రేపటినుంచి ఎడ్యుకేషన్ సమ్మిట్..