భారత రాజకీయాల్లో అజేయ శకం.. నెహ్రూ రికార్డు బద్దలు.. ప్రధాని మోదీ భావోద్వేగ పోస్ట్!

భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2014 మే 26న దేశ ప్రధానిగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ, నేడు అత్యంత అరుదైన చారిత్రక మైలురాయిని అధిగమించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ఎన్నికైన ప్రధానిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ క్రమంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ కాలపు రికార్డును ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. జూన్ 9 నాటికి ఆయన పదవిలో విజయవంతంగా 4,398 రోజులను పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

భారత రాజకీయాల్లో అజేయ శకం.. నెహ్రూ రికార్డు బద్దలు.. ప్రధాని మోదీ భావోద్వేగ పోస్ట్!
Pm Narendra Modi

Updated on: Jun 09, 2026 | 3:06 PM

భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2014 మే 26న దేశ ప్రధానిగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ, నేడు అత్యంత అరుదైన చారిత్రక మైలురాయిని అధిగమించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ఎన్నికైన ప్రధానిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ క్రమంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ కాలపు రికార్డును ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. జూన్ 9 నాటికి ఆయన పదవిలో విజయవంతంగా 4,398 రోజులను పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూన్ 09) సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “మా ప్రభుత్వపు గత 12 సంవత్సరాల పాలన కేవలం అధికార పీఠం కోసం కాదు.. అది దేశ ప్రజల విశ్వాసం, సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితమైంది. 140 కోట్ల దేశ ప్రజల అండదండలు, ఆశీస్సులతో, ‘దేశమే ప్రథమం’ అనే ఏకైక స్ఫూర్తితో మా ప్రయాణం సాగింది. దేశ ప్రగతికి చోదక శక్తులైన యువత, మహిళలు, శ్రామికులు, మన రైతు సోదర సోదరీమణులకు సాధికారత కల్పించడంలో మేము అన్ని విధాలా కృషి చేశాము” అని ప్రధాని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు భారతదేశం సాధించిన అద్భుత విజయాలను ఆయన ప్రస్తావించారు. “మన అవిశ్రాంత కృషి ఫలితంగానే నేడు దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త గుర్తింపును, గౌరవాన్ని పొందింది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అనే మహోన్నత సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు సేవ, సుపరిపాలన, శ్రేయస్సు అనే ఈ మార్గంలో మనం మరింత వేగంగా ముందుకు సాగుతూనే ఉంటాం” అని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

2014 మే 26న తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, 2019లో రెండోసారి మరింత భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది, 2024 జూన్ 9న ఆయన వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డు వైపు అడుగులు వేశారు. నేటితో సరిగ్గా జూన్ 9 మంగళవారం ఆయన మూడో విడత పాలనలోకి అడుగుపెట్టి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, అత్యధిక కాలం పాటు దేశాన్ని నిరంతరాయంగా నడిపించిన ఏకైక నాయకుడిగా నిలిచారు.

గడిచిన 12 ఏళ్ల మోదీ హయాంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో బలోపేతమైంది. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లతో ప్రపంచానికి సరికొత్త పాఠాలు నేర్పింది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వెనుకబడి ఉన్న భారత్, నేడు గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తీసుకునే నిర్ణయాలు నేడు ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నాయి. ప్రధాని మోదీ సాధించిన ఈ చారిత్రక మైలురాయిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us