‘మోదీ అన్నయ్యకు ప్రేమతో’, రాఖీ పంపిన ‘చెల్లెమ్మ’

‘రక్షాబంధన్’ సందర్భంగా ప్రధాని మోదీకి పాకిస్తాన్ కు చెందిన మహిళ.. కమర్ మొహసిన్ షేక్ ఆయనకు రాఖీ పంపింది. కోవిడ్-19 కారణంగా స్వయంగా ఢిల్లీకి రాలేకపోయిన ఆమె.. పోస్టు ద్వారా రాఖీని, ఓ పుస్తకాన్ని పంపినట్టు ప్రధానమంత్రి కారాయలయవర్గాలు తెలిపాయి. వివాహమైన అనంతరం ఈమె అహమ్మదాబాద్ లో నివసిస్తోంది. మోదీకి ఆమె రాఖీ పంపడం ఇది 25 వ సారి. గత 30-35 ఏళ్లుగా తనకు మోదీ గురించి తెలుసునని, మొదటిసారి తను ఆయనను ఢిల్లీలో కలిసినప్పుడు.. […]

మోదీ అన్నయ్యకు ప్రేమతో, రాఖీ పంపిన చెల్లెమ్మ

Edited By:

Updated on: Aug 01, 2020 | 11:47 AM

‘రక్షాబంధన్’ సందర్భంగా ప్రధాని మోదీకి పాకిస్తాన్ కు చెందిన మహిళ.. కమర్ మొహసిన్ షేక్ ఆయనకు రాఖీ పంపింది. కోవిడ్-19 కారణంగా స్వయంగా ఢిల్లీకి రాలేకపోయిన ఆమె.. పోస్టు ద్వారా రాఖీని, ఓ పుస్తకాన్ని పంపినట్టు ప్రధానమంత్రి కారాయలయవర్గాలు తెలిపాయి. వివాహమైన అనంతరం ఈమె అహమ్మదాబాద్ లో నివసిస్తోంది. మోదీకి ఆమె రాఖీ పంపడం ఇది 25 వ సారి. గత 30-35 ఏళ్లుగా తనకు మోదీ గురించి తెలుసునని, మొదటిసారి తను ఆయనను ఢిల్లీలో కలిసినప్పుడు.. కరాచీ నుంచి తను వచ్చానని తెలుసుకున్న ఆయన ఆప్యాయంగా ‘  బెహన్’ అని సంబోధించారని, తనకు సోదరులు ఎవరూ లేరని, అందువల్ల ఆయనను సోదరుడిగా భావించి ప్రతి రక్షాబంధన్ రోజున రాఖీలు కడుతూ వచ్చానని కమర్ వెల్లడించింది.

నా రాఖీని, పుస్తకాన్ని ఆయన అందుకున్నట్టు తెలిసిందని ఆమె పేర్కొంది. మోదీ కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నా అని కమర్ వెల్లడించింది. ఆగస్టు మూడో తేదీన దేశవ్యాప్తంగా ప్రజలు  రక్షాబంధన్  జరుపుకోనున్నారు.