PM Modi Maldives Visit: భారత్‌తో పెట్టుకుంటే ఇంతే మరి..! అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

ఒకప్పుడు అధికారంలోకి రావడానికి ఆ దేశ అధ్యక్షుడు నోటికి పని చెప్పారు.. ఇండియా అవుట్ అంటూ.. అహంకారంతో చెలరేగిపోయాడు.. దీంతో వాణిజ్యం దెబ్బతింది.. పర్యాటకం కకలా వికలం అయ్యింది.. ఒకప్పుడు పర్యాటక సంపదతో బతికి బట్టకట్టిన దేశం.. ప్లీజ్ భారతీయులారా.. మా దేశాన్ని సందర్శించండి.. ఇకపై అలా అనడం.. అంటూ ప్రాథేయపడింది.. అలా అన్న దేశం ఏదో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది.. ఆ దేశం ఏదో కాదు మాల్దీవులు..

PM Modi Maldives Visit: భారత్‌తో పెట్టుకుంటే ఇంతే మరి..! అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..
Prime Minister Narendra Modi And Maldives President Mohamed Muizzu

Updated on: Jul 23, 2025 | 12:39 PM

ఒకప్పుడు అధికారంలోకి రావడానికి ఆ దేశ అధ్యక్షుడు నోటికి పని చెప్పారు.. ఇండియా అవుట్ అంటూ.. అహంకారంతో చెలరేగిపోయాడు.. దీంతో వాణిజ్యం దెబ్బతింది.. పర్యాటకం కకలా వికలం అయ్యింది.. ఒకప్పుడు పర్యాటక సంపదతో బతికి బట్టకట్టిన దేశం.. ప్లీజ్ భారతీయులారా.. మా దేశాన్ని సందర్శించండి.. ఇకపై అలా అనడం.. అంటూ ప్రాథేయపడింది.. అలా అన్న దేశం ఏదో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది.. ఆ దేశం ఏదో కాదు మాల్దీవులు.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చేసిన వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం దుమారం రేపాయి.. ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరించిన తీరు.. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది.. చివరకు మా దేశంలో పర్యటించండి అనేస్థాయికి మాల్దీవులు దిగజారేలా చేసింది.. దీనికి ప్రధాన కారణం.. ప్రధాని మోదీ అనుసరించిన విధానాలే..

ఆ తర్వాత క్రమంగా చైనాతో దగ్గరగా ఉండే.. మాల్దీవుల దేశం భారత్ తో బంధాలను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు భారత్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయి.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చి మరి తమ దేశంలో పర్యటించాలని కోరారు.. దీంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాల్దీవుల పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.. చైనా అనుకూలుడిగా కనిపించే మొహమ్మద్ ముయిజు 2023 నవంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేయడం.. ఇదే సమయంలో ప్రధానమంత్రి మాల్దీవుల పర్యటించడం కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.

నాలుగు రోజుల పాటు..

ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు.. నాలుగు రోజులపాటు యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల్లో పర్యటించనున్నారు.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ బ్రిటన్‌కి నాలుగోసారి, మాల్దీవులకు మూడోసారి వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు UKకి వేళ్తారు.. ఈ పర్యటనలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి మాల్దీవులకు వెళతారు.. జూలై 25, 26 తేదీలలో జరిగే మాల్దీవుల పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది..

దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆతిథ్యం ఇస్తున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీ నిలవనున్నారు. 2023 చివరలో “ఇండియా అవుట్” ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిజు ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

ఈ పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ అక్కడి అధ్యక్షుడు ముయిజుతో సమావేశం నిర్వహించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మాల్దీవులకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. రక్షణ, భద్రతా సహకార సహకారాన్ని కూడా కలిగి ఉంది.. ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 500 మిలియన్ డాలర్లు.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడి ఒప్పందంపై రెండు దేశాలు చర్చిస్తాయి. పునరుత్పాదక ఇంధనం, మత్స్య సంపద సహా కొత్త సహకార రంగాలపై పని చేస్తున్నాయి ఇరు దేశాలు.. మాల్దీవుల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో మాల్దీవుల రక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో భారత్ సాయమందిస్తోంది.

ఇండియా అవుట్ ప్రచారం తర్వాత..

“ఇండియా అవుట్” ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిజు కొన్ని విధానాల కారణంగా భారతదేశం-మాల్దీవులు సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు మాల్దీవులతో సంబంధాలు తెగిపోయాయని.. ప్రచారం చేశాయి. కానీ.. మోదీ ప్రభుత్వం ద్వీప దేశానికి చురకలంటిస్తూనే.. దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించేలా ప్రణాళికను రచించింది. ఆ ఆ “సంబంధాలను ప్రభావితం చేసే లేదా మళ్లీ ప్రయత్నించే సంఘటనలు ఎల్లప్పుడూ ఉంటాయి” అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మంగళవారం మీడియా సమావేశంలో అంగీకరించారు. “కానీ అత్యున్నత స్థాయిలలో శ్రద్ధతో సహా, ఈ సంబంధానికి ఇచ్చిన శ్రద్ధకు ఇది నిదర్శనమని నేను భావిస్తున్నాను.. మేము దానిపై పని చేస్తూనే ఉన్నాము.. ఫలితం మీరు చూడటానికి ఉందని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు. భారతదేశం పొరుగు ప్రాంతం మొదటి విధానం మహాసాగర్ (ప్రాంతాలలో భద్రత, వృద్ధి కోసం పరస్పర సహకారం, సమగ్ర పురోగతి) దృక్పథంలో మాల్దీవులు “చాలా ముఖ్యమైన భాగస్వామి” అని మిస్రి అన్నారు.

మాల్దీవులకు సాయం..

మాల్దీవుల మధ్య నావికా విన్యాసాలు సహా బలమైన రక్షణ, భద్రతా సహకారం ఉన్నందున, భారతదేశం దాని రక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా మాల్దీవులకు సహాయం చేస్తూనే ఉంది. “మాల్దీవులు సంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం వారికి కీలకమైన దేశంగా ఉంది. “మాల్దీవులు సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా వారి అవసరాలకు మేము ఎల్లప్పుడూ ముందుగా స్పందిస్తాము… బలమైన రాజకీయ సంబంధం ఉంది… ఉన్నత స్థాయిలలో క్రమం తప్పకుండా సందర్శనల ద్వారా ఇది బలపడింది” అని మిస్రి అన్నారు.

తొమ్మిది నెలల క్రితం భారతదేశాన్ని సందర్శించిన ముయిజు..

అక్టోబర్ 2024 పర్యటన సందర్భంగా సమగ్ర ఆర్థిక, భద్రతా భాగస్వామ్యం కోసం ఉమ్మడి దార్శనికతను ముయిజు స్వీకరించారు. అది సంబంధాలకు “మార్గదర్శక చట్రం”గా మారిందని అధికారులు తెలిపారు. భారతదేశం ఇప్పటికే మాల్దీవులలో రాయితీ క్రెడిట్, కొనుగోలుదారుల క్రెడిట్ సౌకర్యాల మిశ్రమం ద్వారా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తోంది.. నాలుగు దీవులను అనుసంధానించే గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ప్రధాన ప్రాజెక్టుగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..