AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఢిల్లీ టు భువనేశ్వర్ వయా విజయవాడ.. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నరు ప్రధాని మోది. ముందుగా ఏపీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు. ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10.40కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

PM Modi: ఢిల్లీ టు భువనేశ్వర్ వయా విజయవాడ.. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఇదే..
Pm Modi
Srikar T
|

Updated on: Jun 12, 2024 | 8:14 AM

Share

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నరు ప్రధాని మోది. ముందుగా ఏపీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు. ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10.40కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీని ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు రిసీవ్ చేసుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 10.55కు సభా ప్రాంగణానికి చేరకుంటారు. కేసరపల్లిలో ఉదయం 11.27కు ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవ ముహూర్తంలో పాల్గొననున్నారు. సుమారు గంటన్నరపాటు చంద్రబాబుతో పాటు ప్రముఖులతో కలిసి వేదికపంచుకోనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ఏపీలోని ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న తరువాత మోదీ తిరిగి ఒడిశాకు పయనమవుతారు. మధ్యాహ్నం 12.45కు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భువనేశ్వర్‎కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల సమయంలో భువనేశ్వర్ చేరుకోనున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ తరుణంలో ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నమోహన్‌ చరణ్‌ మాఝీని సభలో పాల్గొననున్నారు. ఈ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంల పూర్తైన వెంటనే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు ప్రధాని మోదీ. రాత్రికి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకుంటారు. ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్ పోర్టు పరిసరాలన్నీ గస్తీకాస్తున్నారు పోలీసులు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!