PM Modi: ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ఖరారు.. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

|

Nov 09, 2022 | 5:57 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ఖరారైంది. నవంబర్‌ 11,12 తేదీల్లో మొత్తం రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi: ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ఖరారు.. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
PM Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ఖరారైంది. నవంబర్‌ 11,12 తేదీల్లో మొత్తం రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనకు సంబంధించి పీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 11వ తేదీ ఉదయం బెంగళూరు చేరుకుంటారు మోడీ. అక్కడ విధానసౌధలోని కనక దాసు, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆతర్వాత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆపై108 అడుగుల కెంపె గౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. చివరిగా మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలోమోడీ పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు, తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరవుతారు. ఈ సందర్భంగా 2018-19, 2019-20 బ్యాచ్‌లకు చెందిన  విద్యార్థులకు ప్రధాని మోడీ చేతుల మీదుగా కాన్వొకేషన్ డిగ్రీలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో..

ఇక నవంబర్ 12వ తేదీ ఉదయం 10:30 గంటలకు మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్‌ నవీకరణ, విస్తరణ పనులు, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, రూ.560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్‌ కూడలి నుంచి షీలానగర్‌ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తాయనున్నారు. ఆతర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు, తెలంగాణాలోని రామగుండంలో ఉన్న RFCL ప్లాంట్‌ను ప్రధాని సందర్శించి ఆ తర్వాత జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత, సాయంత్రం 4:15 గంటలకు, రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..