PM Modi Japan Tour: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 24న జపాన్(Japan) రాజధాని టోక్యోలో(Tokyo) జరిగే క్వాడ్ సమ్మిట్‌కు (Quad summit)హాజరుకానున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారని ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ కౌంటర్ ఫ్యుమియో కిషిదతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అంశంపై ఆయా దేశాల అధ్యక్షులతో సమాలోచనలు జరపనున్నారు.
“ఈ పర్యటనలో, ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వ్యాపారవేత్తలతో ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన జపాన్‌లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి ఆస్ట్రేలియా ప్రధానితో కూడా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది” అని MEA విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మే 21న జాతీయ ఎన్నికలను ఎదుర్కోనున్నారు. “తాము క్వాడ్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు. మేము సమకాలీన అంశాలు , ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాము, ”అని ఆయన అన్నారు.
ఈ టోక్యో సమావేశం.. క్వాడ్ నేతల మధ్య జరిగే నాలుగో భేటీ కానుంది. గత ఏడాది మార్చిలో నాలుగు దేశాల అధ్యక్షులు తొలిసారి వర్చువల్‌గా సమావేశమయ్యారు. సెప్టెంబర్‌లో వాషింగ్టన్లో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఇక 2022 మార్చిలో మూడోసారి నాలుగు దేశాల అధినేతలు వర్చువల్‌గా సమావేశమై చర్చలు జరిపారు. ఇప్పుడు జరిగే జపాన్ లోని సమావేశం నాలుగు భేటీ కానున్నది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..