భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. దీంతోపాటు పురాతన వస్తువుల గురించి కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో అక్రమ రవాణా సందర్భంగా స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువులను ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. మోదీ.. బైడెన్ తో భేటీలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై కూడా చర్చ జరిగింది.. ఈ సందర్భంగా విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. కాగా.. పురాతన వస్తువులను భారత్ కు అప్పగించినందుకు ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.
భారత సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణా విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పురాతన వస్తువులు తిరిగి దేశానికి వస్తున్నాయి.. పురాతన వస్తువుల అక్రమ రవాణా చరిత్రలో అనేక దేశాలను ప్రభావితం చేసిన దీర్ఘకాల సమస్య. భారతదేశం ముఖ్యంగా ఈ సమస్య వల్ల ప్రభావితమైంది.. దేశం నుంచి పెద్ద సంఖ్యలో పురాతన వస్తువులు అక్రమంగా రవాణా అయ్యాయి.. ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా 297 పురాతన వస్తువులను భారత్‌కు అందజేశారు. ఇది 2014 నుండి భారతదేశం స్వాధీనం చేసుకున్న మొత్తం పురాతన వస్తువుల సంఖ్య 640కి చేరుకుంది.
Deepening cultural connect and strengthening the fight against illicit trafficking of cultural properties.
I am extremely grateful to President Biden and the US Government for ensuring the return of 297 invaluable antiquities to India. @POTUS @JoeBiden pic.twitter.com/0jziIYZ1GO
— Narendra Modi (@narendramodi) September 22, 2024
భారతదేశానికి పురాతన వస్తువులను తిరిగి ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ USA పర్యటనలు ప్రత్యేకంగా ఫలవంతమయ్యాయి. 2021లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 12వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కాంస్య నటరాజ విగ్రహంతో సహా 157 పురాతన వస్తువులను అమెరికా ప్రభుత్వం అందజేసింది. అలాగే, 2023లో ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లిన కొద్ది రోజుల తర్వాత 105 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి వచ్చాయి.
భారతదేశానికి సంబంధించిన పురాతన వస్తువులు అత్యధికంగా అమెరికా నుంచి లభించాయి.. UK నుండి 16 కళాఖండాలు, ఆస్ట్రేలియా నుండి 40 ఇతర వస్తువులు తిరిగి వచ్చాయి. 2004-2013 మధ్య ఒక కళాఖండం మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చింది. మొత్తం 578 పురాతన ప్రాచీన వస్తువులు భారత్ కు తిరిగివచ్చాయి. జూలైలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సులో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ – భారతదేశం నుండి USAకి పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి, అరికట్టడానికి మొట్టమొదటి ‘సాంస్కృతిక ఆస్తి ఒప్పందం’పై సంతకం చేశాయి.
గత పదేళ్లలో సాధించిన అద్భుతమైన విజయాలు.. భారతదేశం నుంచి దోచుకున్న సంపదలను తిరిగి పొందేందుకు.. దాని సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు సంరక్షించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ వ్యక్తిగత బంధం ఈ వారసత్వ ఆస్తులను పొందడంలో కీలక పాత్ర పోషించింది. అతని చురుకైన విధానం భారతదేశ సాంస్కృతిక గుర్తింపును పునరుద్ఘాటించే శిల్పాలు, విగ్రహాలతో సహా ముఖ్యమైన కళాఖండాల పునరుద్ధరణకు దారితీసింది.
అమెరికాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఫిలాడెల్ఫియా ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న మోదీకి.. ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.. మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. క్వాడ్ సదస్సుకు హాజరవుతారు మోదీ. ఆదివారం(సెప్టెంబర్ 22) న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు.