Rahul – Priyanka: రైతుల హత్య, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ

|

Oct 10, 2021 | 5:32 PM

లఖింపూర్ ఖేరీలో రైతుల హత్యలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధర పెంపు, దేశంలో నిరుద్యోగంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ

Rahul - Priyanka: రైతుల హత్య,  ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ
Rahul Priyanka
Follow us on

Rahul Gandhi: లఖింపూర్ ఖేరీలో రైతుల హత్యలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధర పెంపు, దేశంలో నిరుద్యోగంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. లఖింపూర్‌ ఖేరిలో రైతులను కాన్వాయ్‌తో తొక్కి చంపిన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుతున్నాయని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో రాహుల్ ప్రధాని మోదీని నిలదీసే ప్రయత్నం చేశారు.

ఇక, ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో ప్రసంగించారు ప్రియాంక గాంధీ. అధిక ధరలతో దేశ ప్రజలు అల్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రధాని మోదీ లఖీంపూర్‌ ఖేరి బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు ప్రియాంక. లక్నోకు వచ్చిన మోదీ లఖీంపూర్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు ప్రియాంకాగాంధీ.

ఇక, అనేక రైతు సంఘాల గొడుగు సంస్థ అయిన సంయుక్త కిసాన్ మోర్చా సైతం మోదీ సర్కారుపై ఇవాళ విమర్శలు గుప్పించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్ మిశ్రా టెని మూడు వాహనాలతో హెలిప్యాడ్ వద్ద తమ నిరసన నుండి రైతులు చెదిరిపోతున్న సమయంలో వచ్చారు అని రైతు నేతలు వివరణ ఇచ్చారు. రైతులతోపాటు, SKM నాయకుడు తజిందర్ సింగ్ విర్క్ మీద నేరుగా వాహనం నడపడానికి ప్రయత్నించారని మోర్చా నేతలు ఆరోపణలు చేశారు.

 

Read also: Minister Kodali Nani: పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు: కొడాలి నాని