‘టైమ్స్’ ప్రతిభావంతుల జాబితాలో మోదీ , ‘దాదీ’ !

ఈ సంవత్సరానికి గాను టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో ప్రధాని మోదీతో బాటుమరో  'బామ్మ'  (దాదీ) కూడా ఉంది. సీఏఎ కి వ్యతిరేకంగా గత ఫిబ్రవరిలో ఢిల్లీ షాహీన్ బాగ్ వద్ద జరిగిన నిరసన..

టైమ్స్ ప్రతిభావంతుల జాబితాలో మోదీ , దాదీ !

Edited By:

Updated on: Sep 23, 2020 | 4:24 PM

ఈ సంవత్సరానికి గాను టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో ప్రధాని మోదీతో బాటుమరో  ‘బామ్మ’  (దాదీ) కూడా ఉంది. సీఏఎ కి వ్యతిరేకంగా గత ఫిబ్రవరిలో ఢిల్లీ షాహీన్ బాగ్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఈ దాదీ పేరు బిల్కిస్..82 ఏళ్ళ ఈ దాదీ నాడు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ ఆందోళనలో నిరసనకారులతో  బాటు కూర్చునేదట. టైమ్స్ తన లీడర్ల కేటగిరీలో మోదీ  పేరును చేరిస్తే  ‘ఐకాన్ల’ కేటగిరీలో బిల్కిస్ ను చేర్చింది. ఆ వయస్సులో కూడా ఈమె ఆందోళనకారులకు తన మద్దతు తెలుపుతూ వారిలో స్ఫూర్తిని నింపింది. ఇక నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీగా పోటీ చేస్తున్న కమలా హారిస్,   చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ వంటివారి పేర్లను ఈ మ్యాగజైన్ ప్రచురించింది.