PM Modi on Katchatheevu: మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీశారు.. కాంగ్రెస్, డీఎంకేపై ప్రధాని మోదీ ఫైర్..

|

Apr 01, 2024 | 12:25 PM

కచ్చతీవు ద్వీపంపై రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.. భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ సర్కార్ 1974లో శ్రీలంక అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ ఇది వార్తల్లోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి..

PM Modi on Katchatheevu: మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీశారు.. కాంగ్రెస్, డీఎంకేపై ప్రధాని మోదీ ఫైర్..
Pm Modi
Follow us on

కచ్చతీవు ద్వీపంపై రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.. భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ సర్కార్ 1974లో శ్రీలంక అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ ఇది వార్తల్లోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు ఎలా అప్పగించిందన్న వార్తా కథనాలను షేర్ చేస్తున్న ప్రధాని మోదీ.. ఆ పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వస్తున్న వాస్తవాలు.. కళ్లు తెరిపించడం, ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. కొత్త వాస్తవాలు కచ్చతీవును కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదులుకుందో వెల్లడిస్తుంది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. ప్రజల మనస్సులలో పునరుద్ఘాటించింది. మేము కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించలేము.. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ మార్గం. ఇది 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు.. చేస్తున్నది ఇదే.. అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ షేర్ చేశారు. అంతేకాకుండా.. మరోసారి ట్వీట్ చేసి.. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కచ్చతీవును ఎలా వదిలేశావో చెబుతూ షేర్ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్..

‘‘వాక్చాతుర్యాన్ని పక్కన పెడితే, తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు DMK ఏమీ చేయలేదు. #Katchatheevu పై వెలువడుతున్న కొత్త వివరాలు DMK ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా బయటపెట్టాయి. కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు.. వారు తమ సొంత కుమారులు, కుమార్తెలు బాగుపడాలని శ్రద్ధ వహిస్తారు. వారు ఎవరినీ పట్టించుకోరు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్య వైఖరి మన పేద మత్స్యకారులు, మత్స్యకారుల ప్రయోజనాలను ముఖ్యంగా దెబ్బతీసింది. అంటూ మోదీ ఫైర్ అయ్యారు.

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై RTI, MEA నుంచి సేకరించిన పత్రాలు, జూన్ 19, 1974న అప్పటి విదేశాంగ కార్యదర్శి కేవల్ సింగ్, చారిత్రక విభాగం డైరెక్టర్ BK బసుతో కలిసి కరుణానిధిని సచివాలయ సమావేశ మందిరంలో కలిశారని చూపిస్తున్నాయి. ఆ తర్వాత డీల్‌ను వివరించడానికి మద్రాస్ కు వెళ్లారు. దానికి తన “సాధారణ అంగీకారం”తో తిరిగి వచ్చారని తెలుస్తోంది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక కథనం, కరుణానిధికి చీఫ్ సెక్రటరీ పి సబానాయగం, ఆ తర్వాత హోం సెక్రటరీ ఎస్పీ ఆంబ్రోస్ కూడా సహకరించారని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. సిరిమావోతో ఒప్పందం కుదుర్చుకోవాలనే నిర్ణయంపై కరుణానిధి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు పేర్కొన్నారు.

ఈ దీవి ఎక్కడుందంటే..?

తమిళనాడు రామేశ్వరం దీవికి సమీపంలో భారత్‌- శ్రీలంకను వేరుచేస్తున్న పాక్‌ జలసంధిలో ఉంది. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. పాక్‌ బే, బంగాళాఖాతంతో ఈ జలసంధి కలుపుతోంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కచ్చదీవు ప్రాంతాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఈ దీవి పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…