గుజరాత్‌లోని కచ్ తీరంలో గస్తీ కాస్తోన్న సరిహద్దు భద్రతా దళం ( బీఎస్‌ఎఫ్ ) జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. నేవీ బోట్లో కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతానికి చేరుకున్న మోదీ.. లక్కీ నాలా వద్ద మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైనికులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు కొందరికి స్వయంగా ఆయనే తినిపించారు. ప్రధాని మోదీ కూడా బీఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికులతో కలిసి దీపావళి పండుగ చేసుకోవడంతో తన దీపావళి తియ్యదినం మరింత పెరిగిపోతుందని సైనికులతో మోదీ అన్నారు. కచ్, సర్ క్రీక్ సరిహద్దులో రక్షణగా సుశిక్షితులైన సైనికులు ఉన్నారని బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సర్ క్రీక్ ప్రాంతం వైపు పాకిస్థాన్ కన్నెత్తి చూసే సాహసం చేయదని.. ఇక్కడ రక్షణగా సుశిక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసని ప్రధాని మోదీ అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌కు మన సైనికులు తగిన బుద్ధి చెప్పారంటూ పేర్కొన్నారు. సర్ క్రీక్‌పై దాడి చేయాలని గతంలో శత్రు దేశాలు చేసిన కుట్రలను భారత సైనికులు తిప్పి కొట్టారని.. ఇకముందు ఎవరూ ఆ సహాసం చేయలేరని పేర్కొన్నారు. ఇకపై భారత్ ఒక అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నారు.
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలాగా ఉన్న సైనికులకు తన తరపున, దేశ ప్రజలందరి తరపున మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం అనవాయితీ వస్తోన్న విషయం తెలిసిందే..
Went to one of the floating BOPs in the Creek area and shared sweets with our brave security personnel. pic.twitter.com/aZ6pE1eajK
— Narendra Modi (@narendramodi) October 31, 2024
కాగా.. గురువారం ఉదయం భారత తొలి ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు ఘననివాళులర్పించారు ప్రధాని నరేంద్రమోదీ. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర పుష్పాంజలి ఘటించారు. అనంతరం, సర్దార్ సేవలను గుర్తుచేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. ఒకే దేశం – ఒకే విధానంతో ముందుకెళ్లినప్పుడే.. వల్లభ్‌భాయ్ పటేల్‌కి నిజమైన నివాళి అర్పించినట్టు అన్నారు ప్రధాని మోదీ. పటేల్ బాటలోనే ఎన్డీఏ సర్కార్.. ఒకే దేశం – ఒకే పాలసీ విధానంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. వన్ నేషన్-వన్ సివిల్ కోడ్-వన్ ట్యాక్స్-వన్ రేషన్.. మాదిరిగానే దేశం బలోపేతం కోసం వన్ నేషన్-వన్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు మోదీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..