PM Modi Speech: స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి.. నేటికీ మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతున్నాయని.. అలా కాకుండా ప్రాంతీయ భాషలల్లో కూడా జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెద్ద జనాభాకు న్యాయ వ్యవస్థ ప్రక్రియ నుంచి నిర్ణయాల వరకు అర్థం చేసుకోవడం కష్టంగా మారిందని.. సాధారణ ప్రజలకు చేరువ అయ్యేలా వ్యవస్థను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కోర్టులలో స్థానిక భాషలను ప్రోత్సహించాలని.. ఇలా చేయడం వల్ల దేశంలోని సాధారణ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని.. దీంతో వారు న్యాయ వ్యవస్థతో అనుసంధానమవుతారని ప్రధాని పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు. మన దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణకు పునాది అని.. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు మన రాజ్యాంగ సౌందర్యానికి సజీవ చిత్రమని ప్రధాని మోదీ అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో న్యాయవ్యవస్థ – కార్యనిర్వాహక వ్యవస్థ రెండింటి పాత్రలు రాజ్యాంగం బాధ్యతలను ఆకాంక్షలను చాటిచెప్పిందని తెలిపారు. అవసరమైన చోట ఈ సంబంధం దేశానికి దిశానిర్దేశం చేయడానికి నిరంతరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
2047 నాటికి 100 ఏళ్లు
2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా దేశంలో అత్యుత్తమ న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా, వాటిని నెరవేర్చగలిగేలా మన న్యాయవ్యవస్థను మనం ఎలా సమర్థవంగా మార్చుకోవాలి.. అనే విషయంపై చర్చ జరగాలన్నారు.
న్యాయ వ్యవస్థలో సాంకేతికత..
భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా మిషన్‌లో కీలకమైన భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికత అవకాశాలను పరిగణిస్తోందని మోదీ అన్నారు. దీనికి ఈ-కోర్టుల ప్రాజెక్ట్ నేడు మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ లావాదేవీలు మన దేశానికి అసాధ్యమని భావించారు. కానీ.. నేడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సర్వసాధారణమైపోయాయి. గతేడాది ప్రపంచంలో జరిగిన డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం డిజిటల్ లావాదేవీలు భారతదేశంలోనే జరిగాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
We should encourage local languages in courts. This will increase the confidence of the common citizens of the country in the justice system: PM Narendra Modi in Delhi pic.twitter.com/nEp08g5z5H
— ANI (@ANI) April 30, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: