WITT 2025: వికసిత్ భారత్‌లో టీవీ9 భాగస్వామ్యాన్ని ప్రశంసించిన ప్రధాని

టీవీ9 శిఖరాగ్ర సమావేశం దేశ సంక్షేమం కోసమేనని ప్రధాని అన్నారు. TV9 ఇండియన్ టైగర్స్ & టైగ్రెస్ టాలెంట్ హంట్ ప్రచారాన్ని ఆయన ప్రశంసించారు. అద్భుతమైన ప్రతిభను వెలికి తీస్తున్నందుకు అభినందనలు చెప్పారు. అంతేకాదు 2047 నాటికి వికసిత్ భారత్ కలను నెరవేర్చే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న టీవీ9 ను ప్రధానిఅభినందించారు.

WITT 2025: వికసిత్ భారత్‌లో టీవీ9 భాగస్వామ్యాన్ని ప్రశంసించిన ప్రధాని
PM Narendra Modi

Updated on: Mar 28, 2025 | 6:34 PM

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సమావేశంలో అనేక అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ రోజు మనం ఏమనుకుంటున్నామో అదే భవిష్యత్తులో జరుగుతందన్నారు. ఈ దశాబ్దంలో మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇందులో అందరి ప్రయత్నాలు అవసరమని తాను ఎర్రకోట ప్రసంగంలో చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వికసిత్ భారత్ కలను నెరవేర్చే క్రమంలో TV9 ఒక సానుకూల చొరవ తీసుకుదన్నారు. సాధారణంగా శిఖరాగ్ర సమావేశాన్ని ఒక హోటల్‌లో నిర్వహిస్తారని, కానీ హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.. భవిష్యత్తులో, ఇతర మీడియా సంస్థలు కూడా ఈ మార్గంలో పయనించాలన్నారు.