
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ ఆ తర్వాత నేరుగా చెన్నై వెళ్లారు. చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైకి చేరుకున్న సమయంలో నరేంద్రమోదీకి కార్యకర్తకు మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది.
సోమవారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో దిగిన వెంటనే మోదీకి అశ్వంత్ పిజై అనే కార్యకర్త కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ విషయమై మోదీ ట్వీట్ చేస్తూ.. ‘చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అశ్వంత్ పిజై అనే కార్యకర్త నన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశ్వంత్ నాతో తన భార్య కవలలకు జన్మనిచ్చారన్న విషయాన్ని తెలిపింది. అయితే తాను ఇంత వరకు తన పిల్లల్ని చూడలేదని, నేరుగా ఇక్కడికే వచ్చాను అన్నాడు’ అని రాసుకొచ్చారు మోదీ.
A very special interaction!
At Chennai airport, one of our Karyakartas, Shri Aswanth Pijai Ji was there to welcome me. He told me that his wife had just given birth to twins but he hadn’t met them yet. I told him he shouldn’t have come here and also conveyed my blessings to him… pic.twitter.com/4Oywc2cSPE
— Narendra Modi (@narendramodi) March 4, 2024
అయితే కార్యకర్తను ఉద్దేశిస్తూ.. అలా చేసి ఉండకూడదంటూ మోదీ చెప్పుకొచ్చారు. కార్యకర్తల పిల్లలకు తన ఆశీర్వాదం ఉంటుందని మోదీ అశ్వంత్ భుజం తట్టారు. బీజేపీ పార్టీకి ఇంత అంకితభావం ఉన్న కార్యకర్తలు ఉండడం హర్షణీయమన్న మోదీ. తమ కార్యకర్తల ప్రేమ, ఆప్యాయతలు చూసి భావోద్వేగానికి లోనయ్యాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదలా ఉంటే ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న ప్రధాని చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ రానున్నారు. సోమవారం రాత్రి రాజ్ భవన్‌లో బస చేయనున్న ప్రధాని.. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వరకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..