PM Modi – Shubhanshu Shukla: ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో శుక్లా దేశానికి గర్వకారణమైన ఒక బహుమతిని ప్రధాని మోదీకి అందజేశారు. అంతరిక్షంలో తనతో పాటు ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకాన్ని ఫ్రేమ్ చేయించి మరీ ప్రధానికి బహూకరించారు.

PM Modi - Shubhanshu Shukla: ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..
PM Modi meets Shubhanshu Shukla

Updated on: Aug 19, 2025 | 10:48 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో శుక్లా దేశానికి గర్వకారణమైన ఒక బహుమతిని ప్రధాని మోదీకి అందజేశారు. అంతరిక్షంలో తనతో పాటు ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకాన్ని ఫ్రేమ్ చేయించి మరీ ప్రధానికి బహూకరించారు. దీంతో పాటే మరో బహుమతి కూడా ఆయనకు బహూకరించారు. ప్రధాని మోదీ శుక్లాను సాదరంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

Pm Modi Shubhanshu Shukla

అంతరిక్షంలో భారత దేశాన్ని ప్రతిబింబించినందుకు ప్రధాని మోదీ శుభాంశు శుక్లాను అభినందించారు. ISS‌కు వెళ్లి వచ్చిన క్రమంలో ఎదురైన అనుభవాలను, సవాళ్లను ప్రధాని మోదీకి శుక్లా వివరించారు. అంతరిక్షంలో శుక్లా అనుభవాలు, అంతరిక్ష విజ్ఞానంలో తాజా పురోగమనాలు, భారత్ ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’ మిషన్ భవిష్యత్తు గురించి చర్చించారు. అంతేకాకుండా త్రివర్ణ పతాకంతో పాటు శుక్లా తన మిషన్‌కు సంబంధించిన ప్రత్యేక మిషన్ ప్యాచ్‌ను కూడా ప్రధానికి బహూకరించారు.

ఈ సందర్భంగా భారత అంతరిక్ష కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోదసీ యాత్రికుడు శుభాంశు శుక్లాకు దేశ లక్ష్యాలను వివరించిన మోదీ.. భారత్‌కు 40-50 మంది వ్యోమగాములు కావాలంటూ పేర్కొన్నారు. స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం, గగన్‌యాన్‌ పెద్ద మిషన్లు అని.. ఇందులో శుభాంశు శుక్లా అనుభవం కీలకం అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..