PM Narendra Modi in Japan highlights: కరోనానే కాదు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ సాయం అందించామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో భాగంగా తొలిరోజు ఇండో -పసిఫిక్ సదస్సుకు హాజరయ్యారు. దీంతోపాటు టోక్యోలో ప్రవాసభారతీయులు, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ రోజు జరిగే క్వాడ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. నిన్న క్వాడ్ దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్ సదస్సులో పాల్గొని అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని కిషిదాతో చర్చలు జరిపారు. చైనా ఆగడాలకు ఎలా చెక్ పెట్టాలన్న విషయంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే తప్పకుండా తాము బదులిస్తామని ఈ సమావేశంలో అన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. జపాన్ రాజధాని టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నో దశాబ్దాల నుంచి జపాన్‌లో భారతీయులు ఉన్నారని అన్నారు మోదీ. అయినప్పటికి భారతీయ సంస్కృతిని జాగ్రత్తగా కాపాడుతున్నారని ప్రశంసించారు. గౌతమబుద్దుడితో జపాన్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. కాశీ పునర్‌నిర్మాణంలో జపాన్ సాయానికి ధన్యవాదాలు తెలిపారు.
భారత్-జపాన్ సహజమిత్రులని అన్నారు. యుద్దకాలంలో బౌద్దమే శరణ్యమన్నారు మోదీ. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికి భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు మోదీ. కరోనా కష్టకాలంలో భారత్ 100 దేశాలకు టీకాలు సరఫరా చేసిందన్నారు. జపాన్ యువత భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు మోదీ. జపాన్‌కు చెందిన 40 ప్రముఖ కంపెనీల సీఈవోలతో కూడా మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇండో -పసిఫిక్ సదస్సులో చైనా దూకుడుకు ఎలా కళ్లెం వేయాలన్న విషయం పైనే ప్రధానంగా చర్చ జరిగింది . ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతుల చేపట్టిన వెంటనే క్వాడ్ సదస్సుకు హాజరయ్యారు ఆంటోని అల్బనీస్. వాతావరణ మార్పులపై క్వాడ్ సదస్సులో కీలక అంశాలను లేవనెత్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..