PM Modi – PMJDY: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకానికి పదేళ్లు.. ప్రధాని మోదీ కీలక ట్వీట్..

|

Aug 28, 2024 | 12:52 PM

10 Years of Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ప్రారంభించి దశాబ్దకాలం పూర్తయింది.. నరేంద్ర మోదీ ప్రధానిగా తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2014 ఆగస్ట్‌ 15న ‘ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన’ పథకం ప్రకటన చేశారు. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ప్రధాని మోదీ విజయవంతంగా ప్రారంభించారు.

PM Modi - PMJDY: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకానికి పదేళ్లు.. ప్రధాని మోదీ కీలక ట్వీట్..
PM Modi
Follow us on

10 Years of Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ప్రారంభించి దశాబ్దకాలం పూర్తయింది.. నరేంద్ర మోదీ ప్రధానిగా తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2014 ఆగస్ట్‌ 15న ‘ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన’ పథకం ప్రకటన చేశారు. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ప్రధాని మోదీ విజయవంతంగా ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయిన కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలను అందించి.. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే సవాలుతో అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చేపట్టి.. అద్భుతమైన విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్‌ ధన్‌ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం పీఎంజేడీవై.. అట్టడుగున మిగిలిపోయిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతను అందించేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది..

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకానికి పదో వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో కీలక ట్విట్ చేశారు.. భారతదేశం అంతటా ఆర్థిక చేరికను పెంపొందించడంలో PMJDY చొరవను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తుచేశారు. ఇది అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడంలో ప్రభావం చూపిందని తెలిపారు..

“ఈ రోజు, ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తించాము. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకానికి పదేళ్లు (#10YearsOfJanDhan).. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు.. జన్ ధన్ యోజన కోట్లాది మందికి ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, గౌరవాన్ని అందించడంలో సహాయపడింది. ముఖ్యంగా మహిళలు, యువత.. అట్టడుగు వర్గాలకు గౌరవాన్ని కల్పించడంలో ప్రధానమైనది.’’.. అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్..

PMJDY పథకం గురించి..

PMJDY భారతీయులందరికీ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్‌లతో సహా ప్రాథమిక ఆర్థిక సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం పదేళ్ల ప్రగతిపై ప్రధాని మోదీ లింక్‌డెన్ పోస్ట్..

పథకం ప్రయోజనాలు..

ఖాతాలకు కనీస నిల్వ అవసరం లేదు.

డిపాజిట్లపై వడ్డీ.

రూపే డెబిట్ కార్డ్ సదుపాయం.

రూ. 1 లక్ష ప్రమాద బీమా కవరేజీ (ఆగస్టు 28, 2018 తర్వాత తెరిచిన ఖాతాలకు రూ. 2 లక్షలకు పెంచారు.)

అర్హత కలిగిన ఖాతాదారులకు రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), MUDRA స్కీమ్‌లకు అర్హత.

గణాంకాలు ఇలా..

PMJDY 53.13 కోట్ల ఖాతాలతో గణనీయమైన మైలురాయిని సాధించింది. వీటిలో 55.6% మహిళలు కలిగి ఉన్నారు. ఈ పథకం గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. మొత్తం ఖాతాలలో 66.6% వాటా ఉంది. డిపాజిట్ బ్యాలెన్స్‌లు రూ.2,31,236 కోట్లకు పెరిగాయి.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి డిపాజిట్లలో 15 రెట్లు పెరుగుదల.. ఖాతాలలో 3.6 రెట్లు పెరుగుదల ప్రతిబింబిస్తుంది. ఖాతాలో సగటు డిపాజిట్ ఇప్పుడు రూ.4,352.

డిజిటల్ వృద్ధి

ఆగస్టు 15, 2014న మోదీ ప్రవేశపెట్టిన PMJDY డిజిటల్ ఆర్థిక వృద్ధిని కూడా ప్రోత్సహించింది. 36 కోట్ల రూపే డెబిట్ కార్డులు జారీ చేశారు.. 89.67 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్లు ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి.. UPI లావాదేవీలు FY 2018-19లో 535 కోట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13,113 కోట్లకు పెరిగాయి. PoS, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూపే కార్డ్ లావాదేవీలు అదేవిధంగా పెరిగాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా PMJDY విజయాన్ని ప్రశంసించారు. లబ్ధిదారులకు, ఈ పథకం విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. జన్-ధన్ యోజన మిలియన్ల మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి భారతదేశం నిబద్ధతను ఈ పథకం ప్రదర్శిస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..