AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: యూపీఐ పేమెంట్స్ గురించి ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి వివరించిన మోదీ.. వీడియో

ఈ సందర్భంగా ఇరువురు నేతలు హస్తకళల దుకాణంతో పాటు టీ దుకాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రామమందిరం ప్రతిరూపాన్ని అందించారు. దీనిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఆసక్తిగా తిలకించారు. అనంతరం అక్కడే ఉన్న ఓ టీ కొట్టును ఇరువురు నాయకులు సందర్శించారు...

PM Modi: యూపీఐ పేమెంట్స్ గురించి ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి వివరించిన మోదీ.. వీడియో
Pm Modi
Narender Vaitla
|

Updated on: Jan 25, 2024 | 9:38 PM

Share

రిపబ్లిక్‌ డేని పురస్కరించుకొని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారత్‌ విచ్చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, సీఎం భజన్‌లాల్ శర్మ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశం జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు హస్తకళల దుకాణంతో పాటు టీ దుకాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రామమందిరం ప్రతిరూపాన్ని అందించారు. దీనిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఆసక్తిగా తిలకించారు. అనంతరం అక్కడే ఉన్న ఓ టీ కొట్టును ఇరువురు నాయకులు సందర్శించారు. అక్కడ టీని తాగారు. ఆ తర్వాత యూపీఐ పేమెంట్స్‌ విధానాన్ని మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి వివరించారు. మోదీ స్వయంగా తన ఫోన్‌లో యూపీఐ పేమెంట్‌ చేసి చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే ఢిల్లీలో శుక్రవారం జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫ్రెంచ్ సైన్యానికి చెందిన బృందం పాల్గొంటోంది. ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఎయిర్‌బస్ A330 మల్టీ-రోల్ ట్యాంకర్ రవాణా విమానం కూడా పరేడ్‌లో పాల్గొంటాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆరో ఫ్రెంచ్ నాయకుడు మాక్రాన్. దీనికి ముందు 2016లో అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, 2008లో నికోలస్ సర్కోజీ, 1998లో జాక్వెస్ చిరాక్, వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, 1980లో 1976, భారత గణతంత్ర దినోత్సవానికి ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ ముఖ్య అతిథిగా వచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్