AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. మంత్రులందరినీ ఢిల్లీలోనే ఉండాలని ఆదేశం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే, దేశ రాజధాని ఢిల్లీలోని సేవా తీర్థంలో గురువారం (మే 21)సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరగనుంది. రాజకీయ, ఆర్థిక పరిణామాలు ముమ్మరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. మంత్రులందరినీ ఢిల్లీలోనే ఉండాలని ఆదేశం!
Pm Modi Cabinet
Balaraju Goud
|

Updated on: May 21, 2026 | 11:07 AM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే, దేశ రాజధాని ఢిల్లీలోని సేవా తీర్థంలో గురువారం (మే 21)సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరగనుంది. రాజకీయ, ఆర్థిక పరిణామాలు ముమ్మరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ భేటీలో కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులు కూడా పాల్గొననున్నారు.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, దాని వల్ల భారత్‌పై పడే ఆర్థిక ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ముడి చమురు సరఫరా, ఇంధన ధరల పెరుగుదలపై సమీక్ష జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ పూరి ఈ సంక్షోభాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతానికి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

మరోవైపు మోదీ 3.0 ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న తరుణంలో, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మంత్రుల పనితీరును సమీక్షించిన అనంతరం జూన్ రెండో వారంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం అటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల దృష్ట్యా, ఇటు దేశీయ రాజకీయ సమీకరణాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us