PM Modi: ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంపై చర్చించారు. మానవాభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ పిలపునిచ్చారు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే యువత నైపుణ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జీడీపీపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మోదీ.

PM Modi: ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi

Updated on: Jun 11, 2026 | 9:21 PM

ఢిల్లీలో 11వ నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రగతి ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని మోదీ అన్నారు. సహకారాత్మక ఫెడరలిజమ్‌ స్ఫూర్తిగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నాయంటూ మోదీ వివరించారు. ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటుందని , కానీ ఆ సంక్షోభాల ప్రభావం భారత్‌పై లేదన్నారు మోదీ. స్టార్టప్‌లు , రైతులు , మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తునట్టు తెలిపారు. కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీతిఆయోగ్‌ వారధిలా పనిచేయాలని మోదీ సూచించారు. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

సమావేశంలో దాదాపు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లింగ, ప్రాంతీయ, సామాజిక-ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సరైన పోషకాహారం, భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేశారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ ను తెలియజేసిన సీఎం చంద్రబాబు

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను అభినందిస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ‘స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ఆవిష్కరించారు. గత దశాబ్దంలో భారతదేశం పాలసీ పెరాలిసిస్ నుంచి పాలసీ గ్రోత్ దిశగా అడుగులు వేసిందంటూ వివరించారు.. మానవ వనరులను పునాదిగా చేసుకుని స్వర్ణాంధ్ర @2047 విజన్ రూపొందించామని చంద్రబాబు తెలిపారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, నీటి-ఇంధన భద్రత, అగ్రి-టెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ వంటి 10 ముఖ్య సూత్రాలను ఈ విజన్‌లో చేర్చారు..

ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్: సీఎం రేవంత్ రెడ్డి..

దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ 11వ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేశ అభివృద్ధికి విద్య , వైద్యం బలమైన పునాదులన్నారు.. ఈ సమావేశంలో వికసిత్ భారత్ సమ్మిళిత అభివృద్ధి పై తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు.. కులగణన తర్వాత తెలంగాణ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us