PM Modi: తన మంత్రివర్గ సహచరుడు చేసిన మానవతా సహాయానికి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ.. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారంటే..’

|

Nov 17, 2021 | 1:13 PM

ప్రధాని మోడీ ఎవరు చిన్న మంచి పని చేసినా వెంటనే అభినందనలు తెలుపుతారు. ఇక తన మంత్రివర్గ సహచరులు నెరవేర్చిన ఏ ఉత్తమమైన కార్యక్రమాన్ని అయినా సరే ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తారు.

PM Modi: తన మంత్రివర్గ సహచరుడు చేసిన మానవతా సహాయానికి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ.. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారంటే..
Pm Modi Iated Minister Dr Bhagwatkarad
Follow us on

PM Modi: ప్రధాని మోడీ ఎవరు చిన్న మంచి పని చేసినా వెంటనే అభినందనలు తెలుపుతారు. ఇక తన మంత్రివర్గ సహచరులు నెరవేర్చిన ఏ ఉత్తమమైన కార్యక్రమాన్ని అయినా సరే ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ చేసిన ఒక పని ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఆయన చేసిన పనికి ప్రధాని ట్విట్టర్ లో అభినందనల సందేశం అందించారు. తన సహచరుడు చేసిన పని తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంతకీ

మంత్రి డాక్టర్ భగవత్ కరద్ ఏం చేశారంటే..

కేంద్ర మంత్రి విమానంలో ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కుంటున్న తోటిప్రయాణీకుడికి వైద్య సహాయం అందించి ప్రాణం పోసారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ సోమవారం రాత్రి ఢిల్లీ-ముంబై విమానంలో సహ ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఢిల్లీ నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడికి కళ్లు తిరిగి, స్పృహతప్పి పడిపోయాడు. వృత్తి రీత్యా సర్జన్ అయిన డాక్టర్ కరాద్, విమానంలోని ఎమర్జెన్సీ కిట్ నుండి రోగికి ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ కూడా ఇచ్చారు. రోగి చెమటతో తడిసి ఉన్నాడని, అతని బీపీ తక్కువగా ఉందని కరద్ చెప్పాడు. అతని షర్ట్ తొలగించి ఛాతీకి మసాజ్ చేశారు. దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రయాణికుడి పరిస్థితి మెరుగుపడింది. అతను రోగిని తన కాళ్ళను పైకి లేపమని, ప్రతి నిమిషం తన స్థానాన్ని మార్చమని అడగడం ద్వారా అసౌకర్యాన్ని తగ్గించాడు. సమాచారం ప్రకారం, రోగికి 40 సంవత్సరాలు, విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత చికిత్స కోసం తీసుకువెళ్లారు.

ఈ విషయాన్ని ఇండిగో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మంత్రి తన విధులను నిరంతరాయంగా నిర్వహిస్తున్నందుకు మేము అభినందిస్తున్నాము. తోటి ప్రయాణికుడికి సహాయం చేయడంలో డాక్టర్ భగవత్ కరద్ సహకారం స్ఫూర్తిదాయకం.” అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ తన ట్వీట్ లో పేర్కొంది. దీనికి స్పందించిన ప్రధాని మోడీ ”వైద్యుడు హృదయంలో ఎప్పుడూ వైద్యుడిగానే ఉంటాడు. నా సహచరుడు చేసిన అద్భుతమైన పని ఇది” అంటూ ట్వీట్ చేశారు. ఇండిగో ట్వీట్ తో పాటు ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.

ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఇదే..

ఇవి కూడా చదవండి: Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..

Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Parenting Tips: గుక్కపెట్టి ఏడిచే సమయంలో.. చిన్నారుల శరీరం నీలం రంగులోకి మారుతుందా.? దీనికి కారణమేంటో తెలుసా..