Telugu News India News PM Modi Announces Next Gen GST Reforms Effective September 22 Top 9 Points
PM Modi: సెప్టెంబరు 22 నుంచి GST ఉత్సవ్.. ప్రధాని చెప్పిన టాప్ 9 పాయింట్స్ ఇవే..
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త GST సంస్కరణలను ప్రధాని మోదీ విప్లవాత్మకమని చెప్పారు. పేదలు, మధ్యతరగతికి మేలు చేకూర్చే ఈ మార్పులు ఉత్పత్తిదారులు, వినియోగదారులకు లాభం కలిగిస్తాయని చెప్పారు. ఇకపై కేవలం రెండు GST శ్లాబులు మాత్రమే ఉండనున్నాయని, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి పెట్టుబడులు, పొదుపు పెరుగుతాయని స్పష్టం చేశారు.
సెప్టెంబరు 22 నుంచి GST ఉత్సవ్ ప్రారంభం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. కొత్త చరిత్ర మొదలవుతోందన్నారు. తదుపరి తరం GST సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయన్నారు.
GST సంస్కరణలు విప్లవాత్మకం అన్నారు ప్రధాని మోదీ. సెప్టెంబర్ 22 నుంచి GSTలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.
GST తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రధాని. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
GST సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయన్నారు ప్రధాని మోదీ. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తాయన్నారు.
గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు ప్రధాని. 2017లో తీసుకొచ్చిన GST ద్వారా కొత్త అధ్యాయం మొదలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చామన్నారు.
సోమవారం నుంచి కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయన్నారు మోదీ. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. పెట్టుబడుల ప్రవాహం, ప్రజల పొదుపు పెరుగుతుందన్నారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులు పంపాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదన్నారు ప్రధాని. వన్ నేషన్-వన్ ట్యాక్స్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. రవాణా చౌకగా మారిందన్నారు.
దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయన్నారు మోదీ. ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులు కొంటామని గర్వంగా చెప్పుకోవాలన్నారు.
రాష్ట్రాలు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలని, అప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమవుతుందన్నారు ప్రధాని మోదీ. మనం ఉత్పత్తిచేసే వస్తువులు దేశ గౌరవాన్ని పెంచుతాయన్నారు. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలన్నారు.