PM Kisan Samman Nidhi: రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. మూడు విడతల్లో ఈ నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఏడు సార్లు ప్రభుత్వం డబ్బు జమ చేసింది. 8వ కూడా నగదు వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.
అయితే ఈ స్కీమ్ పశ్చిమ బెంగాల్‌లో అమలులోకి రాలేదు. మమతా సర్కార్ కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. తాజాగా ఈ పథకాన్ని తమ వద్ద కూడా అమలు చేస్తామని మమతా ప్రకటించారు. అమిత్ షా కూడా బీజేపీ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం యొక్క డబ్బును అందజేస్తామని చెప్పారు. గత రెండేళ్లలోని డబ్బులు రూ.12 వేలు, ఈ ఏడాది రూ.6 వేలు మొత్తం నగదు కలిపి మొత్తం రూ.18 వేలు ఒకేసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈ నిర్ణయంతో దాదాపు 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
Also Read:
వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి
నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..