Alert for Farmers‌: రైతులకు అలర్ట్‌.. గడువు దగ్గర పడుతోంది మిత్రమా.. మే 31 చివరి తేదీ!

|

May 09, 2022 | 11:09 AM

Alert for Farmers‌: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ సాయం..

Alert for Farmers‌: రైతులకు అలర్ట్‌.. గడువు దగ్గర పడుతోంది మిత్రమా.. మే 31 చివరి తేదీ!
Follow us on

Alert for Farmers‌:  కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ సాయం పొందాలంటే రైతులు తమ కేవైసీని పూర్తి చేసుకుని ఉండాలి. లేకపోతే ఆర్థిక సాయం అందదు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి (PM Kisan Samman Nidhi) కింద అర్హులైన రైతులు ఈ-కేవైసీని సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకులు కూడా ఈ-కేవైసీ చేసుకోవాలని పదేపదే చెబుతూ వస్తోంది. ఈ పని చేసుకోకుంటే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే ఇది వరకు ఈ-కేవైసీ గడువు మార్చి 31, 2022 వరకు ఉండగా, దానిని మే 31,2022 వరకు పొడిగించింది. ఈ నెల చివరితో గడువు ముగియనుంది. ఈలోగా కేవైసీ పూర్తి చేసుకోలేని వారు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడం బెటర్‌.

ప్రధాన మంత్రి కిసాన్‌ నమోదిత రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగ్గా చేసుకోవాలని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వెబ్‌సైట్‌లో కేంద్రం తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ కు వెళ్లి తెలుసుకోవచ్చని వెల్లడించింది.అయితే ఆధార్‌ ఓటీపీతో ఈ పని చేయలేరు. ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలంటే రైతులు తమ ఆధార్‌ కార్డును తీసుకుని సీఎస్‌సీ (కామన్‌ సర్వీసు సెంటర్‌)లకు వెళ్లాలని సూచించింది. కాగా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింది విడుదలను పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల చొప్పున జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు వాయిదాలలో రూ.2వేల చొప్పున అందిస్తోంది. పీఎం-కిసాన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) స్కీమ్. అంటే నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లోకే ఏడాదికి రూ.6 వేల చొప్పున నిధులను ప్రభుత్వం అందిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి