RTC Buses: ప్రయాణం అంటేనే ఒక రకంగా బోరింగ్ వ్యవహారం. గంటల కొద్ది కదలకుండా ఒకే చోట కూర్చుంటే పరమ బోర్ కొడుతుంది. ఈ బోర్‌డమ్‌ను తరిమికొట్టడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. గతంలో అయితే మ్యాగజైన్, న్యూస్‌పేపర్లు చదువుతూ కాలక్షేపం చేసేవారు.. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని స్మార్ట్ ఫోన్ ఆక్రమించేసింది. బస్సు, రైళు ఇలా ఏదైనా సరే ప్రయాణం ప్రారంభమైందంటే చాలు ఏబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి నొక్కేయడమే పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా వరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటే కొంతమంది మాత్రం స్పీకర్లు ఆన్ చేసిన పక్కన ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు.
అయితే ఇకపై ఇలా పక్క వారికి ఇబ్బంది పెడతామంటే కుదరదు. బస్సుల్లో లౌడ్ స్పీకర్ ఆన్‌చేసి పాటలు వినడాన్ని నిషేధించారు. ఇది ఎక్కడ అనేగా మీ సందేహం. మన రాష్ట్రంలో కాదులేండి. కర్ణాటక ఆర్టీసీ ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. మొబైల్ స్పీకర్ల ద్వారా పాటలు వినడాన్ని నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే గతంలో కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్టు నిషేధం విధించాలని నిర్ణయించింది.
బస్సులో అనవసర సౌండ్‌ల కారణంగా ఇబ్బంది కలుగుతుందని కోర్టులో దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా బస్సులో లౌడ్ స్పీకర్‌తో ఇతరులను ఇబ్బందికి గురిచేస్తే డ్రైవర్, కండక్టర్‌లు ఆదేశించవచ్చని కోర్టు తెలిపింది. ఒకవేళ సూచనలను పాటించకపోతే సదరు ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని కోర్టు స్పష్టం చేసింది. మన రాష్ట్రంలో నిషేధంలో లేదు కదా అని భారీ శబ్ధాలతో పక్కవారిని ఇబ్బంది పెట్టకండి సుమా..! ఎవరైనా పిటిషన్ వేశారో మన దగ్గర కూడా ఇదే నిబంధన అమల్లోకి రాదన్న సందేహం లేదు.
Also Read: Raja Vikramarka Review: ఫక్తు కమర్షియల్ సినిమా రాజా విక్రమార్క
మీరు హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..
మీరు హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..