Indian Railway: 13 వేల మంది రైల్వే ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్.. దశల వారీగా కొనసాగుతోంది: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal - Railway Staff: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70లక్షల మందికి పైగా..

Indian Railway: 13 వేల మంది రైల్వే ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్.. దశల వారీగా కొనసాగుతోంది: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated on: Feb 11, 2021 | 2:02 PM

Piyush Goyal – Railway Staff: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చారు. ఫ్రంట్‌లైన్ సిబ్బంది నుంచి దశలవారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా దశల వారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ను వేసినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. రైల్వే ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై రాజస్థాన్‌ పాలి ఎంపీ పీపీ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు.

రైల్వే ఉద్యోగులకు టీకాలు వేసే కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13,117 మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మరో విడత టీకా ఇచ్చేందుకు 3,70,316 మంది ఫ్రంట్‌లైన్, రైల్వే ఉద్యోగులను గుర్తించినట్లు గోయల్ పేర్కొన్నారు.

Also Read:

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ సాయమందించండి.. నరేంద్ర మోదీకి కెనడా పీఎం ఫోన్‌.. ఎలాంటి హామీ ఇచ్చారంటే?