Rare Leopard: ఈ భూమి మీద వేల కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వాటిల్లో మనకు తెలిసినవి కొన్ని అయితే.. మనం చూసినవి వేళ్లపై లెక్కించొచ్చు. అయితే, తాజాగా మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో అరుదైన చిరుతపులి కనిపించింది. గతేడాది మహారాష్ట్రలోని తడోబా జాతీయ పార్క్‌లో వ్యణ్యప్రాణి ఫోటోగ్రాఫర్ అనురాగ్ గవాండే పర్యటిస్తుండగా.. అతనికి నల్ల చిరుత కనిపించింది. దాంతో అప్పుడతను ఆ చిరుతను తన కెమెరాలో బందించాడు. అయితే అనురాగ్ తాజాగా తడోబా నేషనల్ పార్క్‌కు వెళ్లగా.. అలాంటి నల్ల చిరుతే మళ్లీ అతనికంట పడింది. దీంతో అనురాగ్ తన కెమెరాకు పని చెప్పాడు. దారికి అడ్డుగా వచ్చిన నల్ల చిరుతను తన కెమెరాతో ఫోటో, వీడియో తీశాడు. ఈ అరుదైన నల్ల చిరుతకు సంబంధించిన ఫోటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, విదేశాల్లో అధికంగా ఉండే ఈ నల్ల చిరుత పులులు మనుగడ మనదేశంలో చాలా అరుదు అని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.
Also read:
Corona: భారత్‌లో ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
World badminton rankings : బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ..