Tamil Nadu: తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు దాడి.. స్పాట్‌లోనే పట్టుకున్న పోలీసులు..
తమిళనాడు రాజ్‌భవన్ దగ్గర పెట్రోబాంబుల దాడి తీవ్ర కలకలం రేపింది. గవర్నర్ రవి నివాసం లోని ప్రధాని ద్వారం దగ్గర రెండు పెట్రోబాంబులను విసిరిన వ్యక్తిని వినోత్‌గా గుర్తించారు. గతంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేతల ఇళ్లపై కూడా వినోత్ పెట్రోబాంబులు విసిరినట్టు కేసు నమోదయ్యింది.
చెన్నై, అక్టోబర్ 25: తమిళనాడు రాజ్‌భవన్ ఎదుట పెట్రోల్ బాంబు దాడి జరిగింది. చెన్నైలోని గిండీలోని గవర్నర్ హౌస్ ఎదుట పెట్రోల్ బాంబు విసిరేందుకు ప్రయత్నించిన ప్రముఖ రౌడీ కరుక్క వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో పెట్రోల్ బాంబు విసిరేందుకు ప్రయత్నించినట్లు కరుక్క వినోద్ అంగీకరించాడు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవాళ (అక్టోబర్ 25) సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని గిండిలో ఉన్న రాజ్ భవన్ గేట్ నంబర్ వన్ వద్దకు వచ్చిన ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబును విసిరాడు. రాజ్ భవన్ గేట్ సెక్యూరిటీ పోలీసులు నిలబడి ఉండగా, అకస్మాత్తుగా తన చేతిలోని పెట్రోల్ బాంబు విసరడంతో అది గేటు దగ్గర పడిపోయింది. దీంతో భయాందోళనకు గురైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Tamil Nadu: A petrol bomb was hurled outside Raj Bhavan today in Chennai. A complaint has been lodged in Guindy police station.
Further details awaited. pic.twitter.com/irbfkZ3sYL
— ANI (@ANI) October 25, 2023
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుపట్టారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై. రాష్ట్రంలో నేరాలు అదుపు చేయడం, శాంతిభద్రతలు పరిరక్షించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి