AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చి పోయిన సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డ్.. ఏం చేశాడంటే … ?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డు అనాజ్ ఖురేషీ రెచ్చి పోయాడు. యూపీలోని మొరాదాబాద్ లో బీభత్సం సృష్టించాడు. వీధుల్లో నానా హంగామా చేసిన అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు… చేపలు పట్టే వలలు విసిరి, తాళ్లతో కట్టేసి నానా పాట్లూ పడ్డారు. చివరకు అతి కష్టం మీద పోలీసు స్టేషనుకు తరలించారు. గురువారం ఇతగాడు షర్టు విప్పేసి.. రోడ్డుపై పరుగులు తీస్తూ.. వాహనాలపై రాళ్లు విసురుతూ .. ఓ ఇనుప రాడ్ పట్టుకుని పలు కార్ల […]

రెచ్చి పోయిన సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డ్.. ఏం చేశాడంటే ... ?
Anil kumar poka
|

Updated on: Sep 27, 2019 | 1:55 PM

Share

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డు అనాజ్ ఖురేషీ రెచ్చి పోయాడు. యూపీలోని మొరాదాబాద్ లో బీభత్సం సృష్టించాడు. వీధుల్లో నానా హంగామా చేసిన అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు… చేపలు పట్టే వలలు విసిరి, తాళ్లతో కట్టేసి నానా పాట్లూ పడ్డారు. చివరకు అతి కష్టం మీద పోలీసు స్టేషనుకు తరలించారు. గురువారం ఇతగాడు షర్టు విప్పేసి.. రోడ్డుపై పరుగులు తీస్తూ.. వాహనాలపై రాళ్లు విసురుతూ .. ఓ ఇనుప రాడ్ పట్టుకుని పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. ఇతడి ‘ భయానక ‘ తీరు చూసి వాహనదారులు, పాదచారులు భయంతో హడలిపోయారు. ఈ బాడీ బిల్డర్ ను పట్టుకునేందుకు పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సహా వందలాది స్థానికులు పడిన అవస్థలు ఇన్నీఅన్నీ కావు. ఈ వీడియో వైరల్ అవుతోంది. స్టెరాయిడ్స్ అధిక మోతాదులో తీసుకోవడంవల్ల ఖురేషీ తన మానసిక స్థితి కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మొరాదాబాద్ బాడీ బిల్డింగ్ టైటిల్ ని సాధించలేకపోయినందుకు ఖురేషీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని, దాన్ని భరించలేక ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకున్నాడని తెలిసింది. ఇతడిని మొదట పోలీసు స్టేషనుకు, ఆ తరువాత బేరైలీ మెంటల్ ఆసుపత్రికి తరలించారు.

ముంబైలో బౌన్సర్ గా పని చేసే ఖురేషీ రెండేళ్ల క్రితం సల్మాన్ బాడీగార్డుగా చేరాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ మంత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఇతడు.. రెండు రోజుల క్రితమే మిస్టర్ మొరాదాబాద్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. ఫస్ట్ రన్నరప్ గా నిలిచినప్పటికీ.. బాడీ బిల్డింగ్ టైటిల్ సాధించలేకపోయాడు. దీంతో ఈ నెల 25 న జిమ్ కి వెళ్లేముందు స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టు తెలిసింది. 2017 లో ఇతనిపై రేప్ కేసు నమోదయింది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యాడు. తన మాజీ బాడీగార్డు ఇలా రెచ్చిపోయినట్టు తెలిసినప్పటికీ సల్మాన్ ఖాన్ స్పందించలేదు. అసలు జరిగిన విషయమేమిటో పూర్తిగా తెలుసుకున్నాకే దీనిపై మాట్లాడతానని తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.

Follow Us
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...