PE Teacher Assists to Woman Deliver : ఒకొక్కసారి సినిమాల్లో జరిగే సీన్స్ నిజజీవితంలో కనిపిస్తే .. కొని చోట్ల సినీ ఫక్కీలో దొంగతనాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 3 ఇడియట్స్ లోని ఓ సూపర్ హిట్ సీన్ ను రిపీట్ చేస్తూ.. నిజజీవితంలో ఒక మహిళ సుఖ ప్రసవం చేసింది. ఈ ఘటన మార్చి 9న కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కొడగులోని గోనికోప్పల్ దగ్గర ఓ గిరిజన తండా కు చెందిన మల్లిగె 9 నెలల గర్భవతి. ఈమె తన ఇద్దరు పిల్లతో కలిసి మినీ విధాన సౌధం వద్దకు వచ్చింది. అయితే ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యేయి. దీంతో సమీపంలోని పార్క్ వద్దకు చేరుకుంది మెలిగే. బాధను భరించలేక గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో ఆమె పిల్లలతో పాటు సమీపంలోని అందరూ షాక్ తిన్నారు. అయితే అక్కడ ఉన్నారు మగవారు కావడంతో సమీపంలో ఎవరైనా మహిళలు ఉన్నారేమో అని వెదికారు. ఒకరు వెంటనే 108 కు కాల్ చేశారు.
ఇంతలో అటుగా వెళ్తున్న శోభా ప్రకాష్ అనే పీఈటీ టీచర్ పార్క్ లోపలి జనాన్ని చూసి ఆసక్తిగా ఆగి అసలు విషయం ఏమిటా అని ఆరాతీసింది. విషయం తెలిసిన వెంటనే శోభా కూడా అంబులెన్స్ కు కాల్ చేశారు. అయితే అక్కడ ఉన్నవారిలో ఒకరు తన స్నేహితుడైన డాక్టర్ కు ఫోన్ చేశారు. ఆ డాక్టర్ అక్కడ ఎవరైనా ఆడవాళ్ళూ ఉన్నరా అని తెలుసుకుని స్కైప్ ద్వారా డెలివరీ ప్రాసెస్ చెప్పడం మొదలు పెట్టారు.
శోభా జాగ్రత్తగా తాను చెప్పినల్టు చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా బయటపడతారని చెప్పడం తో శోభ డాక్టర్ సలహా మేరకు మల్లిగే కు సహాయం చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఆడబిడ్డను ప్రసవించింది మల్లిగె. అయితే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి బొడ్డు తాడు ఎలా కట్ చేయాలో శోభకు అర్ధం కాలేదు.. ఇంతలో ఒకరు కొత్త బ్లెడ్ తీసుకొచ్చి కట్ చేయమన్నారు.. అదే సమయంలో అంబులెన్స్ రావడంతో సర్జికల్ బ్లెడ్ తో బొడ్డు తాడు కట్ చేసి తల్లిని బిడ్డని వేరు చేశారు. వీరిద్దరి ఆస్పత్రికి తరలించారు. ఆధార్ ఆధారంగా మల్లిగె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తనకు ఇటువంటి అనుభవం ఎదురు కావడం ఇదే మొదటి సారని శోభా తెలిపారు. దైర్యంగా డాక్టర్ చెప్పినట్లు చేస్తూ.. తల్లిని బిడ్డని కాపాడిన శోభపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
Also Read: